ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced

ఎఫీసీయూకే బార‌సాల వేడుక‌

Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ధారిగా, రామ్ కార్తీక్‌-అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ (దాము) నిర్మించారు.

కాగా, ఈ నెల 6న, శ‌నివారం ఈ సినిమా బార‌సాల వేడుక జ‌ర‌గ‌నున్న‌ది. ఈ విష‌యం తెలియ‌జేస్తూ, ఎఫ్‌సీయూకే బార‌సాల వేడుక ఫిబ్ర‌వ‌రి 6న అంటూ చిత్ర బృందం ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. దీన్ని చూసి బార‌సాల వేడుక ఏమిటి!.. అంటూ అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యం, కుతూహ‌లం వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆ త‌ర్వాత ప్రి రిలీజ్ ఈవెంట్‌కే ఆ పేరు పెట్టిన‌ట్లు అర్థం చేసుకొన్నారు. ఆ రోజు ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్రేక్ష‌కులు చూడ‌నున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్స్‌, వారి క్యారెక్ట‌ర్ల‌ను ప‌రిచ‌యం చేస్తూ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. వీట‌న్నింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ముఖ్యంగా టీజ‌ర్‌లో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన తీరు అంద‌రిలోనూ క్యూరియాసిటీని రేకెత్తించి, సినిమాపై అంచ‌నాల‌ను అనూహ్యంగా పెంచేసింది.

రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరోకు ఫాద‌ర్‌గా టైటిల్ రోల్ చేసిన జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌లోని రొమాంటిక్ యాంగిల్‌, ఆ యాంగిల్‌ను ఆయ‌న పండించిన తీరు ప్రేక్ష‌కుల్ని అమితంగా అల‌రించ‌నున్నాయి. ఫ్యామిలీ హీరోగా పేరుపొందిన ఆయ‌న చాలా కాలం త‌ర్వాత ఈ త‌ర‌హా పాత్ర‌ను పోషించ‌డం గ‌మ‌నార్హం.

భీమ్స్ సెసిరోలియో సుమ‌ధుర సంగీత బాణీలు అందించిన పాట‌లు ఇటీవ‌ల వ‌రుస‌గా వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్‌, మీడియా సిబ్బంది లాంటి కొవిడ్ హీరోల చేతుల మీదుగా విడుద‌లై సంగీత ప్రియుల ఆద‌రాభిమానాల‌ను పొందుతున్నాయి.

తారాగ‌ణం:

జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

Barasalla Function of FCUK (Father Chitti Uma Karthik) announced

barasalla function
fcuk
father chitti uma karthik movie