Advertisementt

మార్చి 5న ఏప్రిల్ 28న ఏం జరిగింది

Mon 01st Feb 2021 05:53 PM
april 28 em jarigindi movie,april 28 em jarigindi release date,march 5th  మార్చి 5న ఏప్రిల్ 28న ఏం జరిగింది
April 28 Em Jarigindi release date locked మార్చి 5న ఏప్రిల్ 28న ఏం జరిగింది
Advertisement
Ads by CJ

ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండాఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే నమ్మకం వుంది అంటున్నారు దర్శకుడు వీరాస్వామి.జి. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏప్రిల్ 28న ఏం జరిగింది. రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని పనులను పూర్తిచేసుకుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఏప్రిల్ 28 ఏం జరిగింది  అనే డిఫరెంట్ టైటిల్‌తోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించిన మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది.నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది.థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. మార్చి 5న చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్, కెమెరా: సునీల్‌కుమార్, స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా. 

April 28 Em Jarigindi release date locked:

April 28 Em Jarigindi release on March 5th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ