రవితేజ, రమేష్ వర్మ, సత్యనారాయణ కోనేరు ఖిలాడి మే 28 విడుదల
క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా, రాక్షసుడు వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఖిలాడి మే 28న విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ కోనేరు నిర్మాత. డా. జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్‌లైన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
శనివారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించారు. మే 28న చిత్రం విడుదలవుతోందని వెల్లడిస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రస్‌లో, బ్లాక్ గాగుల్స్, బ్లాక్ షూస్‌తో, చేతిలో రివాల్వర్‌తో రోడ్డు మీద నడచుకుంటూ వస్తున్న రవితేజ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ కరెన్సీ నోట్లు గాల్లో ఎగురుతూ ఉన్నాయి.
ఇంతకుముందు రవితేజ పుట్టినరోజు సందర్భంగా జనవరి 26న విడుదల చేసిన వీడియో గ్లిమ్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కు మంచి ట్రీట్ కానున్నదని ఈ గ్లిమ్స్ ద్వారా తెలిపారు మేకర్స్.
రవితేజ సరసన మీనాక్షి చౌధరి మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.
ఉన్నత స్థాయి టెక్నికల్ విలువలతో రమేష్ వర్మ ఖిలాడిని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దుతున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీప్రసాద్ అందిస్తున్న మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్ ఎస్సెట్ కానున్నది. సౌత్ ఇండస్ట్రీలోని నలుగురు టాప్ ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్, అన్బు-అరివు మాస్టర్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. లూసిఫర్ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. అమర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి
శర్వానంద్, సిద్ధార్థ్, అజయ్ భూపతి మహాసముద్రం ఆగస్ట్ 19న విడుదల
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న మహాసముద్రం ఆగస్ట్ 19న విడుదల కానున్నది. అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పట్నుంచీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తి వ్యక్తమవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్ అందరిలోనూ కుతూహలాన్ని కలిగిస్తోంది.
శనివారం మహాసముద్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఆ పోస్టర్‌లో సముద్రం ఒడ్డున ఉన్న ఓ బోట్‌పై ఒకరికొకరు వీపులు చూపిస్తూ కూర్చొని సిగరెట్ తాగుతున్న ఇద్దరు హీరోలు కనిపిస్తున్నారు. ఆ పోస్టర్‌తో పాటు, Our Sail in Theatres Begins this August 19th #MahaSamudram. Join this Voyage to witness an Epic tale of #ImmeasurableLove అంటూ రాసుకొచ్చారు.
తొలిసారిగా ఓ అపురూపమైన ప్రేమకథను తమ బ్యానర్‌పైన అందిస్తున్నామని నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. ఇన్నేళ్లుగా మీరెందుకు ఓ లవ్ స్టోరీని నిర్మించడం లేదని ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతూ వస్తున్నారు. ఇప్పుడు మేం ఎప్పటికీ గర్వపడే ఓ అపురూపమైన, అపారమైన లవ్ యాక్షనర్‌ను అందిస్తున్నాం. 19 ఆగస్ట్ 2021న తీరాలను ఢీకొట్టడానికి మహాసముద్రం వస్తోంది. అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
తారాగణం:
శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి, అను ఇమ్మాన్యుయేల్
పీనట్ డైమండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన హిట్ చిత్రాల దర్శకుడు మారుతి!!
వెర్సటైల్ యాక్టర్ అభినవ్ సర్దార్, రామ్ హీరోలుగా చాందిని తమిలరసన్, షెర్రీ అగర్వాల్ హీరోయిన్స్ గా ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ పతాకాలపై నవ దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా నిర్మిస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా చిత్రం పీనట్ డైమండ్. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హిట్ చిత్రాల దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు.
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. డైరెక్టర్ వెంకటేష్ పదేళ్లుగా తెలుసు. వెరీ టాలెంటెడ్ పర్సన్. ఎప్పుడూ కొత్తగా చెయ్యాలి అని ఆలోచిస్తుంటాడు. నాతోపాటు మా బ్యానర్ లో చాలా సినిమాలకు వర్క్ చేశాడు. అతని ఆలోచనా విధానానికి తగ్గట్లుగానే డిఫరెంట్ స్టోరీ తో సినిమా చేస్తున్నాడు. టైటిల్ చెప్పగానే చాలా కొత్తగా వుందనిపించింది. పోస్టర్ చూడగానే ఇంట్రెస్టింగ్ గా క్యూరియసిటీగా ఉంది. కథ లైన్ చెప్పారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారని. అలాంటి జోనర్లో సినిమా అంటే జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అప్పుడే మనం అనుకున్న ఔట్ ఫుట్ వస్తుంది. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని.. కోరుకుంటున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.. అన్నారు.
నిర్మాతలు అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ.. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా పీనట్ డైమండ్ చిత్రం ఉంటుంది. ఇప్పటివరకూ రాని ఓ సరికొత్త పాయింట్ ఇది. రెండు కాలమానాలకి సంబందించిన ఒక వైవిధ్యమైన కథాంశంతో ఆడియెన్స్ కి నచ్చేలా ఈ సినిమాని వెంకటేష్ తెరకెక్కించాడు. 1989లో ఒక కథ జరుగుతూ ఉంటే.. దానికి ప్యారలల్‌గా 2020లో మరోక కథ రన్ అవుతూ ఉంటుంది. ఆ రెండు కథలకి సంభందం ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది. అనేది మెయిన్ పాయింట్. పీనట్ డైమండ్ టైటిల్ ఎందుకు పెట్టాం? అనేది సినిమా చూస్తే అర్థం అవుతుంది. డెఫినెట్ గా ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే విధంగా సినిమా ఉంటుంది. హైదరాబాద్, తమిళనాడు, కేరళ, వైజాగ్ లలో షూటింగ్ జరిపామ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.
అభినవ్ సర్ధార్, రామ్, చాందిని తమిళరసన్ షేర్రీ అగర్వాల్, శాని సాల్మన్, సుమన్, శుభలేఖ సుధాకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: జె. ప్రభాకర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోటియో,
ఎడిటర్; బస్వా పైడిరెడ్డి,
ఫైట్స్: శంకర్.యు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్; షాని సాల్మన్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని, లైన్ ప్రొడ్యూసర్; శ్రీనిధి నక్కా, ప్రొడక్షన్ కంట్రోలర్; వాల్మీకి శ్రీనివాస్, నిర్మాతలు : అభినవ్ సర్ధార్, త్రిపర్ణ వెంకటేష్,
కథ-స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: త్రిపర్ణ వెంకటేష్.
ఎమోషనల్ థ్రిల్లర్ ది ఛేజ్ టీజర్ రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా నిను వీడను నీడను నేనే, లాంటి థ్రిల్లర్ మూవీ తీసి ఆకట్టుకున్న డైరెక్టర్ కార్తీక్ ప్రస్తుతం రెజీనా తో నేనే నా అనే మరో సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ కాకుండా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాడు డైరెక్టర్ కార్తీక్ రాజు.. తమిళ్ లో హిట్టైన ప్యార్ ప్రేమ కాదల్ మూవీ ఫేం రైజా విల్సన్ మెయిన్ లీడ్ గా ది చేజ్ అనే తెలుగు,తమిళ బైలింగ్వల్ మూవీని రూపొందిస్తున్నాడు. అనసూయ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం.అలాగే మోనిక,సత్యం రాజేశ్,హరీష్ ఉత్తమన్,మధునందన్ ఇతరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీ టీజర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి థ్రిల్లింగ్ గా ఉంది టీజర్. హీరో విజయ్ సేతుపతి,హీరోయిన్ రెజీనా ఈ టీజర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది.మంచి డేట్ చూసుకుని తెలుగు,తమిళ భాషల్లో మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు మేకర్స్.
> ఫిబ్రవరి 5న విడుదలవుతున్న రాధాకృష్ణ సినిమాని అందరూ ఆదరించి విజయవంతంచేయాలని కోరుకుంటున్నాను - ప్రముఖ దర్శకుడు శ్రీనివాస రెడ్డి.
ప్రముఖ దర్శకుడు ఢమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం రాధాకృష్ణ. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఒక కీలకపాత్రలో నటిస్తున్నారు. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిహరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక కృష్ణకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి5న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..
చిత్ర నిర్మాణ సారథి పుప్పాల కృష్ణకుమార్ మాట్లాడుతూ - ఈ ఫిబ్రవరి 5న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఈ సినిమాని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం.ఎం.శ్రీలేఖగారు..కొత్త నిర్మాత అయినప్పటికీ మా సినిమా ఒప్పుకుని అద్భుతమైన సంగీతాన్నిఅందించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇప్పటివరకు విడుదలచేసిన అన్ని పాటలకి, ట్రైలర్‌కి మంచి స్పందన వస్తోంది. హీరో అనురాగ్‌కి ఇది రెండో సినిమానే అయినా మొదటినుండి మా అందరికీ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారు. తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారికి సోదర సమానుడైన డైరెక్టర్ ప్రసాద్ వర్మగారుప్రసాద్ వర్మ ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే నన్నునిర్మాతగా పరిచయం చేస్తున్న మా గురువుగారు డమరుకం శ్రీనివాస్ రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక లక్ష్మీపార్వతి గారు ఈ సినిమాకి బ్యాక్‌బోన్‌గా ఉండడంతో పాటు మొదటి సారి ఈ సినిమాలో ఒక కీలకపాత్రలో అద్భుతంగా నటించారు. ఆమెకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు గారు ప్రత్యేక పాత్రలో నటించారు. పైసావసూల్ ఫేమ్ ముస్కాన్ సేథిగారు కథ వినగానే ఒప్పుకుని అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫామెన్స్ చేశారు. ఈ సినిమాతో ఆమె మరింత పెద్ద హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అలీగారి కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ అవుతుంది. సురేందర్ రెడ్డిగారు గొప్ప కెమెరామెన్. ప్రతి సీన్‌ను ఎక్సలెంట్‌గా విజువలైజ్ చేశారు. మా హరిణి ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ రాధాకృష్ణ సినిమాను ఫిబ్రవరి5న ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రసాద్ వర్మ మాట్లాడుతూ - ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నందుకు హ్యాపీగా ఉంది. పల్లెటూరి నేపథ్యంలో ఒక అందమైన లవ్‌స్టోరీతో పాటు హస్తకళలకు సంభందించిన మంచి పాయంట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. మా గురువుగారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతో సహకారం అందించారు. అలాగే నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన పుప్పాల సాగరిక కృష్ణకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.
నటుడు కృష్ణభగవాన్ మాట్లాడుతూ - నిర్మల్ బొమ్మల బ్యాక్‌డ్రాప్‌లో తీసిన మంచి ప్రేమకథా చిత్రమిది. ఎం.ఎం శ్రీలేఖగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. హీరో హీరోయిన్స్‌గా అనురాగ్, ముస్కాన్ సేథీ చక్కగా నటించారు. శ్రీనివాసరెడ్డిగారు ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఆయన కామెడి యాంగిల్ గురించి మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో కూడా నేను, ఆలీ, వనిత, చమ్మక్‌చంద్ర, ఫని కలిసి ఒక అద్భుతమైన కామెడీ ట్రాక్ చేయించారు. ఆ ట్రాక్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది. మంచి మనసున్న కృష్ణకుమార్‌గారికి ఈ సినిమాతో మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ - రాగల24 గంటల్లో తర్వాత నేను చేస్తోన్న రెండో చిత్రమిది. మంచి సాఫ్ట్ లవ్‌స్టోరీ. దానికి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా బాగా కుదిరింది. దర్శకుడు ప్రసాద్ వర్మగారు ఒక స్వచ్చమైన పల్లెటూరి ప్రేమకథని చాలా ఆహ్లాదంగా చూపించారు. కృష్ణకుమార్‌గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోసారి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరెడ్డిగారికి ధన్యవాదాలు. అలీగారు చాలా సపోర్ట్‌చేశారు. ఈ సినిమాలో చాలా మంది సీనియర్ యాక్టర్స్‌తో కలిసి నటించడం జరిగింది. శ్రీలేఖ గారు ఒక్కో సాంగ్‌ని ఒక్కో జోనర్‌లో కంపోజ్ చేశారు. ఫిబ్రవరి5న థియేటర్‌లో సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి అన్నారు.
ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ
హర్రర్ & రొమాంటిక్ తో మన ముందుకు వస్తుంది. విశాఖ టాకీస్ బ్యానర్ పై కీర్తి చావ్లా,సాధికా,అది ప్రేమ్, కవిత,శ్రీమాన్,గౌతమ్ రాజు, నెలగల రవి నటీనటులుగా జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నట్టి కుమార్ నిర్మిస్తున్న సినిమా ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ.. హార్రర్,గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం యూత్ కంటెంట్ తో తెరకెక్కుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేస్తున్న సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ...కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీ గా తెరకెక్కుతున్న మూవీ.ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ".ఈ చిత్రంలో హార్రర్ ,గ్రాఫిక్స్ తో పాటు యూత్ కు కనెక్ట్ అయ్యే రొమాంటిక్ అంశాలు ఇందులో ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రైలర్ విడుదల చేస్తున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా మొదటి కాపీ రెడీ అయ్యింది.సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ వారు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది . ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు