Advertisementt

ఏప్రిల్ 9న పవన్ ఫాన్స్ కి పండగే

Sat 30th Jan 2021 06:11 PM
vakeel saab movie,pawan kalyan,venu sriram,dil raju,vakeel saab release date,pril 9th  ఏప్రిల్ 9న పవన్ ఫాన్స్ కి పండగే
Vakeel Saab Release date locked ఏప్రిల్ 9న పవన్ ఫాన్స్ కి పండగే
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం వ‌కీల్ సాబ్‌. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి వ‌కీల్‌సాబ్‌పై అంచ‌నాల‌ను అమాంతంగా పెంచింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. 

తమ అభిమాన కథానాయకుడిని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మ‌ర్‌లో బాక్సాఫీస్ హీట్‌ను పెంచ‌డానికి వ‌కీల్‌సాబ్‌ను ఏప్రిల్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఫ్రేములోనూ శ్రీరామ్ వేణు.. ప‌వ‌న్‌ను యూత్‌, మాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌:  రాజీవ‌న్‌, ఎడిటింగ్‌:  ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌:  తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌:  బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు:  దిల్‌రాజు, శిరీష్ , ద‌ర్శ‌క‌త్వం:   శ్రీరామ్ వేణు

Vakeel Saab Release date locked:

Vakeel Saab Release on April 9th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ