Advertisementt

A అనంత్ శ్రీరామ్ 'కలయిక ఓ మాయ'

Sat 30th Jan 2021 05:54 PM
a movie,kalayika o maya lyrical song  A అనంత్ శ్రీరామ్ 'కలయిక ఓ మాయ'
Kalayika O Maya Lyrical Song Release A అనంత్ శ్రీరామ్ 'కలయిక ఓ మాయ'
Advertisement
Ads by CJ

A నుండి 'కలయిక ఓ మాయ' రొమాంటిక్ సాంగ్ విడుదల !

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం A. ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని పివి ఆర్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా చిత్ర యూనిట్ పబ్లిసిటీ ప్రమోషన్స్ యమా స్పీడ్ గా  ముమ్మరం చేస్తున్నాయి. A చిత్రం నుండి కలయిక ఓ మాయ పాటని జనవరి 28న రేడియో సిటీలో విడుదల చేశారు. అపర మేధావి యువ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఈ పాటని రచించగా దీపు, పావని ఆలపించారు.. టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ కురాకుల అద్భుతమైన స్వరాలను సమకూర్చారు.. ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతలనుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. 

చిత్ర దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్ లో చాలా మూవీస్ వచ్చాయి. వాటన్నిటి కంటే భిన్నంగా మా A సినిమా ఉంటుంది. సెన్సార్ సభ్యులు మూవీ చూసి.. చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అభినందించారు. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తధనంతో ఏ సినిమా తీసినా ఆదరిస్తామని ప్రేక్షకులు ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని పెయిర్ చాలా బాగుంది. ఇద్దరూ పోటాపోటీ గా నటించారు. మా నిర్మాత గీతా గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనంత శ్రీరామ్ పాటలు మరియు ఆయన సపోర్టు వల్ల ఈ సినిమా బాగా రావటం జరిగింది. ప్రవీణ్ బంగారి ఫోటోగ్రఫీతో పాటు విజయ్ కురాకుల మ్యూజిక్, ఆనంద్-పవన్ ఎడిటింగ్ మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.. చిన్న సినిమా అయినా సినిమా నచ్చి పివిఆర్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.

నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ.. యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి A చిత్రాన్ని బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించాం. టెక్నికల్ గా, విజువల్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ మంచి సినిమా కోసం తమవంతు సహకారం అందించారు. టీజర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. అంచనాలకు మించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా యుగంధర్ ముని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అలాగే పివిఆర్ లాంటి బిగ్ బ్యానర్ ద్వారా మా చిత్రం ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుంది.. అన్నారు.

సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల. నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.

Click Hear: Kalayika O Maya Lyrical Song

Kalayika O Maya Lyrical Song Release:

A Movie feb 26th Release

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ