Advertisementt

సంక్రాంతి సీజన్ వదలనంటున్న మహేష్

Fri 29th Jan 2021 05:23 PM
superstar,mahesh babu,sarkaru vaari paata,parasuram,sarkaru vaari paata release date,sankranthi 2022  సంక్రాంతి సీజన్ వదలనంటున్న మహేష్
Sarkaru Vaari Paata release date locked సంక్రాంతి సీజన్ వదలనంటున్న మహేష్
Advertisement
Ads by CJ

2022 సంక్రాంతి కానుక‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాట‌

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌ల దుబాయ్‌లో ప్రారంభ‌మైన విష‌యంతెలిసిందే..గ‌తంలో సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చిత్రాలు ఒక్క‌డు ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలి‌చింది, అలాగే బిజినెస్‌మేన్ సెన్సేష‌న‌ల్  హిట్ట‌య్యింది, స‌రిలేరు నీకెవ్వ‌రు సెన్సేష‌న‌ల్ ఇండ‌స్ట్రీ హిట్ అయ్యింది. ఇలా సంక్రాంతికి సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌కి మంచి విజ‌యాలున్నాయి. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు, ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఎంతో ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వ‌స్తోన్న స‌ర్కారు వారి పాట చిత్రాన్ని కూడా 2022 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ఈ సంద‌ర్భంగా..

చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ -  2022 సంక్రాంతి పండ‌గ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు స‌ర్కారు వారి పాటతో ప్రారంభం అన్నారు.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,

సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,

సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,

ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,

ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,

ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్,

పిఆర్ఓ: బి.ఏ.రాజు,  

లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,

కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,    

సీఈఓ: చెర్రీ,

నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,

రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

Sarkaru Vaari Paata release date locked:

Superstar Mahesh Babu Sarkaru Vaari Paata As Sankranthi 2022 Gift

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ