Advertisementt

విరాట పర్వం కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది!

Thu 28th Jan 2021 07:48 PM
rana daggubati,sai pallavi,priyamani,director venu udugula,nanditha das,naveen chandra,zareena wahab,eswari rao,sai chand,benarji,nagineedu,rahul ramakrishna,devi prasad,anand ravi,anand chakrapani  విరాట పర్వం కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది!
Virata Parvam To Release On April 30th విరాట పర్వం కూడా డేట్ ఫిక్స్ చేసుకుంది!
Advertisement
Ads by CJ

రానా, సాయిప‌ల్ల‌వి, వేణు ఊడుగుల చిత్రం విరాట‌ప‌ర్వం ఏప్రిల్ 30 విడుద‌ల‌‌

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా విరాట‌ప‌ర్వం. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న విరాట‌ప‌ర్వం ను ఏప్రిల్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌, సంక్రాంతి ప‌ర్వ‌దినాన రిలీజ్ చేసిన రానా-సాయిప‌ల్ల‌వి జంట పోస్ట‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఇవ‌న్నీ విరాట‌ప‌ర్వం పై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. రానా, సాయిప‌ల్ల‌వి జోడీ చూడ‌చ‌క్క‌గా ఉంద‌ని అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ క‌నిపించ‌ని పాత్ర‌ల్లో రానా, సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్నారు. మిగ‌తా ముఖ్య పాత్ర‌ల్లో ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్ క‌నిపించ‌నున్నారు.

తారాగ‌ణం: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, న‌వీన్ చంద్ర‌, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వ‌రీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్ర‌పాణి.

సాంకేతిక బృందం: ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: వేణు ఊడుగుల‌, నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి, స‌మ‌ర్ప‌ణ‌: సురేష్ బాబు, బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎస్.ఎల్‌.వి. సినిమాస్‌.

Virata Parvam To Release On April 30th:

Virata Parvam To Release On April 30th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ