Advertisementt

సడెన్ గా F3 డేట్ అనౌన్స్ చేసేసిన దిల్ రాజు

Thu 28th Jan 2021 06:47 PM
f3,venkatesh,anil ravipudi,mehreen kaur,varun tej,ef release date,thamanna,f3 release,august 27th  సడెన్ గా F3 డేట్ అనౌన్స్ చేసేసిన దిల్ రాజు
F3 release date locked సడెన్ గా F3 డేట్ అనౌన్స్ చేసేసిన దిల్ రాజు
Advertisement
Ads by CJ

విక్టరీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శరవేగంగా రూపొందుతోన్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ఎఫ్3...ఆగస్ట్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్న‌ర్‌గా  బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ఎఫ్ 2. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ఎఫ్‌2 చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోంది. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఫ‌న్ రైడ‌ర్‌ను ఆగ‌స్ట్ 27న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌లు అధికారికంగా తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ - ‘మా బ్యానర్‌లో 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ నవ్వుల జల్లులో ప్రేక్షకులను ముంచెత్తి ఎంత పెద్ద హిట్ సాధించిందో మీ అందరికీ తెలిసిందే. ఎఫ్ 2 ప్రేక్షకులను ఎలా నవ్వించిందో ..దానికి మోర్ ఫన్ యాడ్ చేసి ఎఫ్ 3 కథను సిద్ధం చేశాడు డైరెక్టర్ అనీల్. ప్రస్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ ల కాంబినేషన్తో మరోసారి ప్రేక్షకులను మరింత ఎంటర్ టైన్ చేయడానికి ఆగ‌స్ట్ 27న  ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో న‌వ్వుల రైడ్ క‌న్‌ఫ‌ర్మ్‌ అన్నారు. 

బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ - ఎఫ్ 2కు ఫ్రాంచైజీగా మోర్ ఫ‌న్‌తో ఎఫ్‌3 చిత్రాన్ని రూపొందిస్తున్నాం. విక్ట‌రీ వెంక‌టేశ్‌గారు, మెగాప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌గారు.. నిర్మాత‌లు రాజుగారు, శిరీష్ గారు స‌పోర్ట్‌తో చ‌క‌చ‌కా సినిమాను పూర్తి చేస్తున్నాం. ఆగ‌స్ట్ 27న మ‌రోసారి న‌వ్వుల్లో ముంచెత్త‌డానికి మీ ముందుకు వ‌స్తున్నాం అన్నారు. 

F3 release date locked:

F3 Fun Begins In Theatres On Aug 27

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ