Advertisementt

కళాపోషకులు వస్తున్నారు.!

Thu 28th Jan 2021 06:39 PM
kalaposhakulu movie,kalaposhakulu movie 29th released  కళాపోషకులు వస్తున్నారు.!
Kalaposhakulu Movie 29th Released కళాపోషకులు వస్తున్నారు.!
Advertisement
Ads by CJ

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి రేపే వస్తున్నారు.. కళాపోషకులు!

 యంగ్ టాలెంటెడ్ హీరో   విశ్వకార్తికేయ హీరోగా దీప ఉమావతి హీరోయిన్ గా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు చలపతి  పువ్వల ద‌ర్శ‌క‌త్వంలో టేస్ట్ ఫుల్ ప్రొడ్యూసర్ యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్  చిత్రం కళాపోషకులు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ సాధించింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి  రేపే వస్తున్నారు.. కళాపోషకులు. 

నిర్మాత యం. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా  కళాపోషకులు చిత్రాన్ని రూపొందించాం.. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా చలపతి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా చూసి సెన్సార్ సభ్యులు అందరూ మంచి సినిమా తీశారని అప్రిషియేట్ చేశారు. డబ్బు నేపథ్యంలో సాగే డిఫరెంట్ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది. రేపే వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో మా కళాపోషకులు చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు.  

విశ్వకార్తికేయ, దీప ఉమాపతి జంటగా నటించిన ఈ చిత్రంలో భాష, చైతన్య, చిన్ను, జ్వాల, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్, చిట్టిబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్: కళ్యాణ్ సమి, ఎడిటర్: సెల్వ కుమార్, సంగీతం: ఎలేందర్ మహావీర్, పీఆర్ఓ: సాయి సతీష్, రాంబాబు పర్వతనేని,  నిర్మాత, స్టొరీ: సుధాకర్ రెడ్డి.ఎం. స్క్రీన్ ప్లే-డైలాగ్స్- డైరెక్షన్: చలపతి పువ్వల.

Kalaposhakulu Movie 29th Released:

Kalaposhakulu Telugu Movie Released in most theaters worldwide

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ