Advertisementt

ఏప్రిల్ 16న 'లవ్ స్టోరి'

Tue 26th Jan 2021 09:54 AM
love story movie,love story movie stills,love story movie released on april 16th  ఏప్రిల్ 16న 'లవ్ స్టోరి'
Love Story Movie Released on April 16th ఏప్రిల్ 16న 'లవ్ స్టోరి'
Advertisement
Ads by CJ

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతున్న 'లవ్ స్టోరి'

అందమైన జోడీ నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ సెన్సిబుల్ డైరెక్ట్ ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయింది.. భారీ అంచనాలున్న ఈ ప్రేమ కావ్యాన్ని ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.. హాట్ సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు.ఈ అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్, రీసెంట్ గా సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ అయ్యేసరికి ఫ్యాన్స్ అంతా ఏప్రిల్ 16 కోసం వెయిట్ చేస్తున్నారు.

లవ్ స్టోరి చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు.

సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు, రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Love Story Movie Released on April 16th:

Cool Love Story on Hot Summer on April 16th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ