Advertisementt

రాణి రుద్రమ.. స్టార్‌ మా లో

Sat 16th Jan 2021 06:28 PM
rani rudrama dev,star maa,rani rudrama serial  రాణి రుద్రమ.. స్టార్‌ మా లో
Rani Rudrama Serial in Star Maa రాణి రుద్రమ.. స్టార్‌ మా లో
Advertisement
Ads by CJ

తెలుగు టెలివిజన్‌ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్టార్‌ మా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. కొత్తరకం కథల్ని, ధైర్యసాహసాల వ్యక్తుల విశిష్ట గాధల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఎప్పుడూ కొత్తదనానికి అగ్ర తాంబూలం ఇస్తూ వస్తున్న స్టార్‌ మా ఇప్పుడు ఓ అద్భుతమైన చారిత్రక సువర్ణాధ్యాయాన్ని తమ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. అది రుద్రమదేవి సీరియల్‌. ఏ పేరు వింటే ప్రతి తెలుగు హృదయం ఉప్పొంగుతుందో.. ఆ కథే ఇప్పుడు ఓ అద్భుతమైన ధారావాహికగా తెలుగు లోగిళ్లకు గొప్ప అనుభూతిని పంచబోతోంది. స్ట్రెయిట్‌ తెలుగు సీరియల్‌గా, ఓ దృశ్యకావ్యంలా రూపు దిద్దుకున్న ఈ రుద్రమదేవి ధారావాహిక కథాకాలాన్ని యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కషి చేస్తున్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తూ కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దీక్షగా పనిచేస్తున్నారు. ఈ ధారావాహిక స్టార్‌ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. ఇది మన తెలుగు కథ. మన తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో స్టార్‌ మా అందిస్తున్న కథ

CLICK HERE!! for Rudrama Devi Promo

ప్రెస్ రిలీజ్ బై: ఇండియన్ క్లిక్స్, ఎల్ఎల్ సి 

Rani Rudrama Serial in Star Maa:

Rani Rudrama Devi- The emotional saga of one the bravest and most iconic figures of the Telugu Market

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ