1. ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణలో యంగ్ హీరో నాగశౌర్య, సంతోష్ జాగర్లపూడి `లక్ష్య`.
యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం లక్ష్య. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. నాగశౌర్య 20వ చిత్రంగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో ఈ మూవీ తెరకెక్కుతోంది. కాగా సంక్రాంతి శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇప్పటి వరకు పవర్‌ఫుల్ మాస్ స్టిల్స్‌ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సారి నాగశౌర్య, కేతికశర్మలతో కూడిన రొమాంటిక్ పొస్టర్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
2. యాభై శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న సతీష్ మాలెంపాటి 'సమిధ`.
మర్మం, కనులు కలిసాయి వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించిన దర్శకుడు సతీష్ మాలెంపాటి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషలలో రూపొందుతోన్న చిత్రం సమిధ. రాజస్థాన్‌లో జరిగిన యథార్ధ సంఘటన ఆధారంగా మూడు భాషల్లో డిఫరెంట్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని అరుణం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఉండిపోరాదే మూవీ ఫేమ్ అనువర్ణ, తమిళ నటి ఛాందిని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే 50% చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నుండి సంక్రాంతి శుభాకాంక్షలతో కొత్త పోస్టర్‌ని విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్షిత్ శశి కుమార్, అనువర్ణ, ఛాందిని, రవివర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రావణ్, రవికాలే, బ్లాక్ పాండీ, కేపివై బాలా, శంకర్ మూర్తి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: బి. నాగేశ్వర రెడ్డి, ఆర్ట్: మురళి, నిర్మాణం: అరుణం ఫిలింస్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ మాలెంపాటి.
3. సమ్మర్ స్పెషల్‌గా విడుదల కానున్న విక్టరి వెంకటేష్ `నారప్ప`.
సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. వెంకటేష్ , ప్రియమణి ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. వెంకీ గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఇలా ఫ్యామిలీతో కలిసి కొత్తగా కనిపిస్తున్నారు. పోస్టర్ లో కేరాఫ్ కంచరపాలెం ఫేం కార్తీక్ రత్నం సహా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుడం చూడొచ్చు.. ఇప్పటివరకు విడుదలైన లుక్స్ సినిమాపై అంచనాలను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు మేకర్స్.
>>4. ఆది సాయికుమార్ ఫిల్మ్ 'శశి' ఫిబ్రవరి 12 విడుదల.ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం శశి. సురభి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో హీరోయిన్లు ఆది, సురభి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వెళ్తున్నారు. ఆదిని ప్రేమగా కౌగలించుకొని సురభి కళ్లు మూసుకొని ఉంటే, ఆది ఆనందంగా నవ్వుతున్నాడు.ఇటీవల ఆది సాయికుమార్ బర్త్‌డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. టీజర్‌లో ఆది సరికొత్తగా కనిపిస్తున్నాడనీ, అతనికి ఈ సినిమా బ్రేక్ నిస్తుందనే నమ్మకం కలుగుతోందనీ చెప్పడంతో పాటు, ఒక ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతోందనీ చిరంజీవి ప్రశంసించారు.అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రానికి అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు.
5. 'తెల్లవారితే గురువారం' ఫస్ట్ లుక్ విడుదల
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, మత్తు వదలరా చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం తెల్లవారితే గురువారం. సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మత్తు వదలరా భిన్నతరహా చిత్రంగా పేరు తెచ్చుకోగా, ఆ చిత్రంలో ప్రదర్శించిన అభినయంతో శ్రీసింహా ప్రతిభావంతుడైన నటునిగా అందరి ప్రశంసలూ పొందారు.ఇప్పుడు తెల్లవారితే గురువారం లాంటి మరో కొత్త తరహా చిత్రాన్ని ఆయన చేస్తున్నారు. టైటిల్ ఎంత విలక్షణంగా ఉందో, పోస్టర్‌ను అంత ఆసక్తికరంగా డిజైన్ చేశారు. ఈ పోస్టర్‌లో పెళ్లికొడుకు గెటప్‌లో మహారాజా కుర్చీలో కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ కనిపిస్తున్నారు శ్రీసింహా. ఆయన చేతిలో పెళ్లి దండ కూడా ఉంది. శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు. ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కలర్ ఫొటో తో లాక్‌డౌన్‌లో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్‌ను అందించింది. తండ్రి ఎం.ఎం. కీరవాణి తరహాలో బాణీలు కడుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌లో ఉంది. మార్చి నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.