Advertisementt

ప్రభాస్ ఫాన్స్ ఖుషి ఖుషి!

Thu 14th Jan 2021 10:50 PM
salaar movie,salar movie launching on january 15th,salar movie  ప్రభాస్ ఫాన్స్ ఖుషి ఖుషి!
Salaar with muhurat puja on January 15th ప్రభాస్ ఫాన్స్ ఖుషి ఖుషి!
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, సెన్సేష‌న‌ల్‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, అగ్ర‌ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ కాంబినేష‌న్‌లో జ‌న‌వ‌రి 15న లాంఛ‌నంగా ప్రారంభం కానున్న ‘స‌లార్‌’

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో క్వాలిటీ చిత్రాల‌ను నిర్మించి ద‌క్షిణాది సినీ పరిశ్ర‌మ‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాల‌నే ఉన్న‌తాశ‌యంతో హోంబ‌లే ఫిలింస్ అనే నిర్మాణ సంస్థ‌ విజ‌య్ కిర‌గందూర్ క్రేజీ ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ప్ర‌శాంత్‌నీల్ కాంబినేష‌న్‌లో విజ‌య్ కిర‌గందూర్ అనౌన్స్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అంద‌రినీ ఆస‌క్తిని రెట్టింపు చేస్తూ వ‌స్తున్నాయి. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. హీరో క్యారెక్ట‌ర్‌ను డిఫ‌రెంట్‌గా డిజైన్ చేయ‌డ‌మే కాకుండా, అప్ప‌టి వ‌ర‌కు ఫ్యాన్స్ ఎవ‌రూ చూడ‌నటువంటి ఓ పాత్ర‌లో హీరోను అద్భుతంగా ఆవిష్క‌రించ‌డంలో ఆయ‌న స్పెష‌లిస్ట్‌. 

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ స‌లార్‌. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుండి ప్రేక్ష‌కాభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేస్తుంది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్న స‌లార్‌ చిత్రం జ‌న‌వ‌రి 15న ఉద‌యం పదకొండు గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఈ కార్య‌క్ర‌మానికి స‌లార్ చిత్ర‌యూనిట్ స‌హా క‌ర్ణాట‌క డిప్యూటీ చీఫ్ మినిష్ట‌ర్ అశ్వ‌త్ నారాయ‌ణ్ సీఎన్‌, ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ స‌హా ఇత‌ర సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. 

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మాట్లాడుతూ ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్య‌క్ర‌మాలు ముగిసి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామా.. నా లుక్‌ను ఫ్యాన్స్‌కు, ప్రేక్ష‌కులకు ఎప్పుడు రిలీజ్ చేస్తామా అని చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది అన్నారు.

Salaar with muhurat puja on January 15th:

 Salaar movie launching on January 15th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ