Advertisementt

సంక్రాంతి ఫీస్ట్ ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్ రిలీజ్..

Thu 14th Jan 2021 10:26 PM
vakil saab movie,vakil saab movie teaser release,  సంక్రాంతి ఫీస్ట్  ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్ రిలీజ్..
Vakil Saab Movie Teaser Release సంక్రాంతి ఫీస్ట్ ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్ రిలీజ్..
Advertisement
Ads by CJ

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘వ‌కీల్ సాబ్‌’ టీజర్ రిలీజ్.. సంక్రాంతి సంద‌ర్భంగా ప్రేక్ష‌కాభిమానుల‌కు ఫీస్ట్

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ ప‌తాకాల‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు, ప్రేకకులకు ట్రీట్ ఇచ్చేలా సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 

లాయర్స్ వేసుకునే కోటుని పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వేసుకోవ‌డంతో మొద‌లైన టీజ‌ర్‌.. ఆయ‌న లా పుస్త‌కాల‌ను మూసి ఉంచిన క‌వ‌ర్‌ను తొల‌గించ‌డం, సీరియ‌స్‌గా కోర్టులో అబ్జ‌క్ష‌న్ యువ‌రాన‌ర్ అంటూ డైలాగ్ చెప్ప‌డం.. అలాగే త‌నని క‌త్తితో పొడ‌వ‌డానికి వ‌చ్చిన విల‌న్స్‌తో కోర్టులో వాదించ‌డం తెలుసు.. కోటు తీసి కొట్ట‌డ‌మూ తెలుసు అంటూ వారిని చిత‌క‌బాద‌డం.. వంటి మాస్ స‌న్నివేశాల‌తో పాటు.. చివ‌ర‌లో త‌న ల‌గేజీతో ట్రావెల్ చేస్తుంటారు. బ్యాగ్రౌండ్ లో స‌త్య‌మే జ‌య‌తే.. అనే ప‌దానికి సంబంధించిన మ్యూజిక్ వినిపిస్తుంది. 

టీజ‌ర్ ప‌క్కా మాస్‌ను, పవన్ ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది. త‌మ‌న్ త‌న‌దైన స్టైల్లో సూప‌ర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో టీజ‌ర్‌లోని ప్ర‌తి స‌న్నివేశాన్ని ఎలివేట్ చేశాడు. పవన్ కల్యాణ్ సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఫ్రేములోనూ శ్రీరామ్ వేణు.. ప‌వ‌న్‌ను యూత్‌, మాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు. ఈ టీజ‌ర్‌తో ‘వ‌కీల్ సాబ్‌’ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపించేలా సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ఇత‌ర తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: పి.ఎస్‌.వినోద్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి, డైలాగ్స్‌:  తిరు, యాక్ష‌న్ ర‌వివ‌ర్మ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: యుగంధ‌ర్‌, కో ప్రొడ్యూస‌ర్‌:  హ‌ర్షిత్ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: బోనీ క‌పూర్‌, నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్, ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ వేణు.

Vakil Saab Movie Teaser Release:

Vakil Saab Teaser released 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ