నిత్యామీనన్, అదితిరావు హైదరి, ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం మిస్కిన్ సైకో. డీఎస్ సినిమాస్ పతాకంపై డి.శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు. పిశాచి, డిటెక్టివ్ వంటి సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన దర్శకుడు మిస్కిన్ నుంచి వస్తున్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. నిర్మాత డి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వైవిధ్యమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కొత్తదనాన్ని కోరుకునే తెలుగు సినీ ప్రేక్షకుల కోసం మిస్కిన్ సైకో చిత్రాన్ని థియేటర్స్‌లోకి తీసుకు వస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం అన్నారు.