Advertisementt

వేస‌విలో విరాట‌ప‌ర్వం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్.

Wed 13th Jan 2021 06:32 PM
akhil akkineni,pooja hegde,most eligible bachelor,rana,sai pallavi,virata parvam movie,  వేస‌విలో విరాట‌ప‌ర్వం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్.
Rana, Sai pallavi's movie to be released in Summer వేస‌విలో విరాట‌ప‌ర్వం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్.
Advertisement
Ads by CJ

రానా, సాయిప‌ల్ల‌వి, వేణు ఊడుగుల చిత్రం 'విరాట‌ప‌ర్వం' స‌మ్మ‌ర్‌లో విడుద‌ల‌

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా విరాట‌ప‌ర్వం. డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పురస్క‌రించుకొని ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ చిత్ర బృందం బుధ‌వారం స‌రికొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో ఆలివ్ గ్రీన్ డ్ర‌స్‌లో న‌క్స‌లైట్‌గా రానా క‌నిపిస్తుండ‌గా, ఆయ‌న చేతిని ప‌ట్టుకొని సంప్ర‌దాయ తెలుగింటి అమ్మాయిలా లంగా వోణీ డ్ర‌స్సులో సాయిప‌ల్ల‌వి క‌నిపిస్తున్నారు. అడ‌విలో న‌డుచుకుంటూ వెళ్తున్న‌ట్లున్న ఆ ఇద్ద‌రూ హాయిగా న‌వ్వుతున్నారు.ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో విరాట‌ప‌ర్వం ను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లు ఆ పోస్ట‌ర్ ద్వారా నిర్మాత‌లు తెలియ‌జేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్‌కు, రానా బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ గ్లింప్స్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. నిజానికి ఇవ‌న్నీ విరాట‌ప‌ర్వం పై అంచ‌నాల‌ను పెంచి, ఆడియెన్స్‌లో, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో క్రేజ్ తీసుకొచ్చాయి. 

 

అకిల్ అక్కినేని - పూజా హెగ్డే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్' 2021 వేస‌విలో విడుద‌ల.

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సంక్రాంతి పోస్ట‌ర్ విడుదల.అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ లో అఖిల్ - పూజా మ‌ధ్య కెమిస్ట్రీ క‌నువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో  వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా, అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌. ఈ సినిమాను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు

akhil akkineni,pooja hegde,most eligible bachelor,rana,sai pallavi,virata parvam movie,

Rana, Sai pallavi's movie to be released in Summer:

Akhil Akkineni - Pooja Hegde Most Eligible Bachelor to be Released In Summer 2021.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ