Advertisementt

ఇంకా పార్టీలు ఉన్నాయంటున్న సునీత

Wed 13th Jan 2021 11:48 AM
singer sunita,parties,honemoon  ఇంకా పార్టీలు ఉన్నాయంటున్న సునీత
Sunita still seems to have parties! ఇంకా పార్టీలు ఉన్నాయంటున్న సునీత
Advertisement
Ads by CJ

సింగర్ సునీత తనకి సెకండ్ మ్యారేజ్ కుదిరిన సందర్భంగా కాబోయే భర్తతో కలిసి హైదరాబాద్ హోటల్స్ లో గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇచ్చిన విషయం తెలిసిందే. సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలు సోషల్లో మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దాదాపుగా సింగర్ సునీత ఆమె భర్త రామ్ కలిసి ఆరు గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలు ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. అలాగే పెళ్లిని కూడా గుడిలో గ్రాండ్ గా కుటుంబం, సన్నిహితుల మధ్యన చేసుకున్న సునీత.. తన భర్త రామ్ తో కలిసి కొత్తింట్లో అడుగుపెట్టింది. అయితే ఇప్పుడు సునీత పెళ్లి ముచ్చట్లు ముగియగా ఆమె హానిమూన్ టాపిక్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది.

సునీత హనీమూన్ కోసం ఆమె కూతురు శ్రీయ భారీ ఏర్పాట్లను చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలపై సునీత స్పందించింది. కరోనా కారణంగానే తన పెళ్ళికి పెద్దగా ఎవరిని పిలవలేకపోయానని.. అయినప్పటికీ పెళ్ళికి 200 మంది అతిధులు వచ్చారని చెప్పిన సునీత.. పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు సన్నిహితులకు చిన్న చిన్న పార్టీలు ఇవ్వాలంటుంది. పెళ్ళికి పిలవలేకపోయిన కొంతమంది సన్నిహితులకు పార్టీలు ప్లాన్ చేసుకున్నాకే తన హానిమూన్ ప్లాన్స్ ఉంటాయని చెబుతుంది సునీత. మరి రిసెప్షన్ పెట్టడం కన్నా ఇలా చిన్న చిన్న పార్టీలు ఇస్తే అందరిని కవర్ చేసినట్టుగా ఉంటుంది అనేది సునీత ఉద్దేశ్యం అన్నమాట.

Sunita still seems to have parties!:

After parties then Honeymoon!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ