Advertisementt

బయటికొచ్చినా బంకలా అతుక్కునే ఉన్నారుగా?

Wed 13th Jan 2021 11:30 AM
monal,akhil,big boss4  బయటికొచ్చినా బంకలా అతుక్కునే ఉన్నారుగా?
This couple is so cute! బయటికొచ్చినా బంకలా అతుక్కునే ఉన్నారుగా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ నుండి గత ఏడాది పునర్నవి - రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ పక్షుల్లా పాపులర్ అయ్యి బయటికి వచ్చారు. కానీ ఆ జంట తర్వాత కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలు పెద్దగా లేవు. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో జంట పక్షుల్లా మారి హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన అఖిల్ - మోనాల్ జంట ని బిగ్ బాస్ బాగా పాపులర్ చేసింది. మోనాల్ - అఖిల్ మధ్యన సం థింగ్ సం అంటూ ప్రచారం జరిగేలా వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి. ఇక బయటికొచ్చాక బెస్ట్ ఫ్రెండ్స్ లా కవరింగ్ ఇస్తున్న ఈ జంట ఎక్కడ చూసినా జంట పక్షుల్లా వీర విహారం చేస్తుంది. అఖిల్ - సోహెల్ - మోనాల్ లు న్యూ ఇయర్ పార్టీ అంటూ చేసిన హంగామా మరవకముందే ఇప్పుడు మరోసారి దొరికిపోయింది ఈ జంట.

అఖిల్ మోనాల్ లు బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చినాక కూడా బంకలా అతుక్కునే ఉన్నారనడానికి ఈ పిక్ ఉదాహరణగా సరిపోతుందేమో. అఖిల్ తో క్లోజ్ గా హాట్ గా మోనాల్ చైర్ లో కూర్చుని ఇచ్చిన హాటెస్ట్  ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. ఈ జంటక నెటిజెన్స్ లైక్ ల మీద లైక్స్ షేర్స్ మీద షేర్ లు కొడుతున్నారు. అంతేనా భలే క్యూట్ గా ఉంది ఈ జంట అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి మోనాల్ బిగ్ బాస్ నుండి బయటికొచ్చాకా కెరీర్ లో దూసుకుపోతూ అవకాశాల మీద అవకాశాలు పట్టేస్తుంది. అఖిల్ కి ఇంకా కెరీర్ స్టార్ట్ అయినట్లుగా లేకపోయినా.. ఓ అభిమాని అఖిల్ కి విలువైన లాప్ టాప్ ఇవ్వడం, అలాగే మోనాల్, అఖిల్, సోహెల్ ల పార్టీ వంటి విషయాలతో అఖిల్ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు.

This couple is so cute!:

Monal and akhil still hanging out with each other.

Tags:   MONAL, AKHIL, BIG BOSS4
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ