Advertisementt

'కపటధారి' అసలు హంతకుడు ఎవరు?

Wed 13th Jan 2021 11:01 AM
kapatadhari movie,kapatadhari stills,nagachaitanya,samantha,kapatadhari trailer  'కపటధారి' అసలు హంతకుడు ఎవరు?
Nagachaitanya, Samantha released Kapatadhari trailer 'కపటధారి' అసలు హంతకుడు ఎవరు?
Advertisement
Ads by CJ

అక్కినేని నాగచైతన్య, సమంత విడుదల చేసిన 'కపటధారి' ట్రైలర్‌

సుమంత్‌ హీరోగా ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న థ్రిల్లర్‌ క‌ప‌ట‌ధారి. సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, ఇదంజ‌గ‌త్‌ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకున్న సుమంత్ ఇప్పుడు క‌ప‌ట‌ధారి అనే ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తున్నారు. క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ట‌యిన కావ‌లుధారి సినిమాకు ఇది తెలుగు రీమేక్‌. క్రియేటివ్ ఎంట‌ర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ బ్యాన‌ర్‌పై ఈ డిఫ‌రెంట్ పాయింట్‌తో రూపొందిన కావ‌లుధారి చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో డా.ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను అక్కినేని నాగచైతన్య, సమంత విడుదల చేశారు. 

ట్రైలర్‌ను చూస్తే.. మెట్రో లైన్‌ తవ్వకాల్లో కొన్ని అస్థిపంజరాలు బయటపడ్డాయి.. ఈ శవాలను పాతిపెట్టి ఎంత కాలం అయ్యుంటుంది..! ట్రాఫిక్‌ ఎస్సైవా.. అదొక క్లోజ్డ్‌ కేస్‌ చనిపోయిన వ్యక్తి పేరు సంపత్‌ రాజ్‌.. దీన్ని బట్టి చూస్తే స్టేట్మెంట్‌ ఇచ్చిన వారిలో ఎవరో ఒకరు అబద్దం చెప్పారు. 

క్రైమ్‌ అయినా ట్రాఫిక్‌ అయినా పోలీస్‌ పోలీసే.. ఇలాంటి డైలాగ్స్‌తో పాటు ఆసక్తిరేపే సన్నివేశాలతో కపటధారి ట్రైలర్‌ ఉంది. కొంతకాలం క్రితం జరిగిన హత్యలకు సంబంధించిన అస్థిపంజరాలు దొరుకుతాయి. వాటిని సీరియస్‌గా తీసుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా ఛేదిస్తాడు. ఈ కేసును సాల్వ్‌ చేసే క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని కథానాయకుడు ఎలా అధిగమించాడు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని, త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తామని అంటున్నారు నిర్మాతలు. 

ఈ చిత్రానికి  డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్ష‌న్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్ట‌ర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

న‌టీన‌టులు: సుమంత్‌, నందిత‌, పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంప‌త్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి, నిర్మాత‌:  డా.జి.ధ‌నంజ‌య‌న్.

Nagachaitanya, Samantha released Kapatadhari trailer:

Nagachaitanya, Samantha released Kapatadhari trailer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ