Advertisementt

`గాడ్సే`తో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి జత!

Sun 10th Jan 2021 02:18 PM
godse movie,aishwarya lakshmi  `గాడ్సే`తో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి జత!
Aishwarya Lakshmi is the heroine of the Godse movie `గాడ్సే`తో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి జత!
Advertisement
Ads by CJ

స‌త్య‌దేవ్‌, గోపి గ‌ణేష్ ప‌ట్టాభి, సి క‌ళ్యాణ్ `గాడ్సే` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌‌మ‌వుతున్న ఐశ్వ‌ర్య ల‌క్ష్మి.

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ త‌న త‌దుప‌రి చిత్రంగా గోపి గ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శ‌కత్వంలో  గాడ్సే మూవీ చేస్తోన్న విష‌యం తెలిసిందే.. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ మూవీ టైటిల్ పోస్ట‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సి.కె. స్క్రీన్స్ ప‌తాకంపై ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌ వంటి  క్లాసిక్ మూవీ తర్వాత స‌త్య‌దేవ్‌, గోపిగ‌ణేష్ ప‌ట్టాభి యాక్ష‌న్ ప్యాక్‌డ్ థ్రిల్ల‌ర్ గాడ్సేతో మ‌రోసారి అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. 

పాపులర్ మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి కొన్ని త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించింది.  ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుంది. తెలుగులో అరంగేట్రం చేయడానికి ఇది సరైన చిత్రం అని ఆమె నమ్ముతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో సత్యదేవ్ న‌టిస్తుండగా, ఐశ్వర్య లక్ష్మి కూడా పెర్‌ఫామెన్స్‌కి మంచి స్కోప్ ఉండే పాత్ర‌లో న‌టిస్తోంది. గోపిగ‌ణేష్ ప‌ట్టాభి  ద‌ర్శ‌క‌త్వంతో పాటు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌నుఅందిస్తున్న ఈ చిత్రానికి సి.వి. రావు స‌హ నిర్మాత‌. నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిషోర్ ఇత‌ర  ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో  న‌టిస్తున్నారు.

తారాగ‌ణం: స‌త్య‌దేవ్‌, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ త‌దిత‌రులు.

సాంకేతిక బృందం: క‌థ‌, స్క్రీన్‌ప్లే,మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం‌: గోపిగ‌ణేష్ ప‌ట్టాభి,పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌, బ్యాన‌ర్‌: సి.కె. స్క్రీన్స్‌

స‌హ నిర్మాత‌: సి.వి. రావు, నిర్మాత‌: సి. క‌ల్యాణ్‌.

Aishwarya Lakshmi is the heroine of the Godse movie:

Aishwarya Lakshmi is the heroine of the Godse movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ