Advertisementt

చాలా గ్యాప్ తరువాత ఎగ్జ‌యిట్ అవుతోంది

Thu 07th Jan 2021 03:15 PM
kgf 2,yash,raveena tandon  చాలా గ్యాప్ తరువాత ఎగ్జ‌యిట్ అవుతోంది
KFG 2 It was an amazing experience చాలా గ్యాప్ తరువాత ఎగ్జ‌యిట్ అవుతోంది
Advertisement
Ads by CJ

యష్, ప్రశాంత్ నీల్‌తో క‌లిసి ‘కేజీయఫ్ చాప్టర్ 2’ లో ప‌నిచేయం చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది - ర‌వీనాటాండ‌న్‌

యష్‌తో తొలిసారి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

 అద్భుతమైన అనుభవం అండీ. యష్‌ జెమ్‌లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. అద్భుతమైన నటుడు. తనతో పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. 

కేజీయఫ్‌2లో మీ కేరక్టర్‌ ఎలా ఉండబోతోంది?.. మాకు కాస్త చెప్పండి?

 చాలా వైవిధ్యమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తాను. అందుకే కేరక్టర్ గురించి ఇప్పుడు ఎక్కువగా చెప్పలేను. నా పాత్ర పేరు రమికా సేన్‌. కాస్త కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. కానీ అంతే పవర్ ఫుల్‌ కేరక్టర్‌. గ్రే షేడ్స్ కూడా కాస్త ఉంటాయి. నా పాత్ర నెక్స్ట్ సీన్‌లో ఎలా బిహేవ్‌ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. అంత గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది. 

యష్‌తో మీరు షేర్‌ చేసుకోబోయే స్క్రీన్‌ స్పేస్‌ని సిల్వర్ ‌స్క్రీన్‌ మీద చూడటానికి మీ ఫ్యాన్స్ నిజంగా వెయిట్‌ చేస్తున్నారు. వాళ్ల నుంచి మీకు డైరక్ట్ మెసేజ్‌లు ఏమైనా అందాయా?  ఒకవేళ అందితే ఎలాంటి మెసేజ్‌లు అందుతున్నాయి?

వాళ్లు అలా ఎదురుచూస్తున్నారన్న ఆలోచనే నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని చెప్పిన క్షణం నుంచి వాళ్ల ఎదురుచూపులు మొదలయ్యాయి. కేజీయఫ్‌1కి చాలా పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే సీక్వెల్‌ కోసం చాలా మంది చాలా చాలా ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నా ఫస్ట్ లుక్‌ చూస్తే అభిమానులకు పండగే. ఆన్‌స్క్రీన్‌లో రమికను చూడటానికి కచ్చితంగా అభిమానులు ఇష్టపడతారు. నా అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది. 

ఈ చిత్రంలో మీరు ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్‌ సన్నివేశాలు  చేసినట్టున్నారు?

 కాస్త ఆగండి.. (నవ్వుతూ)! ఇంకొన్నాళ్లు ఓపిక పడితే, స్క్రీన్‌ మీద చూద్దురుగానీ. 

ఈ సినిమాను మీరు ఒప్పుకున్న క్షణాలు గుర్తున్నాయా?

 ప్రశాంత్‌ నీల్‌ వచ్చి స్టోరీ చెప్పగానే నాకు చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపించింది. ప్రశాంత్‌ నీల్‌ నాకు ఈ కథ చెప్పేటప్పటికి నేను ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. ఆ తర్వాతే నేను ఫస్ట్ పార్ట్ చూశాను. అసలు ఇంత అద్భుతంగా ఎలా తీశాడా? అని నేను విస్తుపోయాను. మైండ్‌ బ్లోయింగ్‌ సినిమా అనిపించింది. న్యూ ఏజ్‌ సినిమా అప్రోచ్‌ కనిపించింది కేజీయఫ్‌ 1లో. అలాగే అతను కథ చెప్పిన తీరు, కథ, పార్ట్ 2లో నా పాత్ర అన్నీ వరుసగా కళ్ల ముందు కదిలాయి. ఈ సినిమా వద్దు అనో, నేను చేయననో చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. పైగా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను.

ప్రశాంత్‌ నీల్‌తోనూ, హోంబలే ఫిల్మ్స్ సంస్థతోనూ మీ అసోసియేషన్‌ గురించి ఒక్క మాటలో చెబుతారా?

ప్రశాంత్‌ పనిచేసే తీరు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు అలాంటి పనితనమే, తన వర్కింగ్‌ స్టైలే తనని స్పెషల్‌గా ఉంచింది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉండే అతనిలో అలాంటి ఆలోచనల ప్రవాహం సాగుతూ ఉంటుందని ఎవరూ అనుకోరు. కానీ అతని కలలు, అతని ఆలోచనలు.. సామాన్యులకు ఊహాతీతంగా ఉంటాయి.

KFG 2 It was an amazing experience:

Yash super talented and a meticulous actor -Raveena Tandon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ