Advertisementt

ధియేటర్ లలోనే రంగ్ దే

Fri 01st Jan 2021 11:00 PM
rangde movie,producer surayadevara nagavamsi,p.d.v.prasad,director venky atluri  ధియేటర్ లలోనే రంగ్ దే
Rangde all set release on march 26th directly in theatres ధియేటర్ లలోనే రంగ్ దే
Advertisement
Ads by CJ

యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే చిత్రం మార్చి 26 న విడుదల

యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ఈ రంగ్ దే. ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

2021 ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. చిత్రం విడుదల తేదీని ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి మ్యూజిక్ తో కూడిన  ఓ వీడియో రూపకల్పన చేశారు. ఇందులో  నితిన్, కీర్తిసురేష్ ల నృత్యాభినయం, సంగీతం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 2021 మార్చి 26 న ధియేటర్ ల లోనే చిత్రం విడుదల అవుతుందని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల రంగ్ దే చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే.ప్రేమ తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ  రంగ్ దే. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ రంగ్ దే చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్), సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశీ, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Rangde all set release on march 26th directly in theatres :

 nithin and Keerthi suresh's starring Rangde movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ