Advertisementt

క్లైమాక్స్‌లో `సీటీమార్`

Fri 01st Jan 2021 03:11 PM
seetimaarr movie,gopi chand,director sampath nandi,  క్లైమాక్స్‌లో `సీటీమార్`
Gopichand, Director Sampath Nandi's 'Seetimaarr' Is In It's Climax క్లైమాక్స్‌లో `సీటీమార్`
Advertisement
Ads by CJ

క్లైమాక్స్‌లో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నందిల `సీటీమార్`

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘సీటీమార్‌’. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ ఫీమేల్ క‌బ‌డ్డీ టీమ్ కోచ్‌గా మిల్కీ బ్యూటీ ‌త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

ఇప్ప‌టికే  ఈ సినిమా నుండి విడుద‌ల‌చేసిన ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, జ్వాలా రెడ్డిగా త‌మ‌న్నాలుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు న్యూ ఇయ‌ర్ విషెస్‌తో ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది చిత్ర యూనిట్‌. ప్ర‌స్తుతం చెవెళ్ల‌లో వేసిన భారీ సెట్లో ఫైట్ మాస్ట‌ర్ వెంక‌ట్ సార‌థ్యంలో మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది భారీ ఎత్తున యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సెట్లోనే కేక్ క‌ట్ చేసి న్యూ ఇయ‌ర్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ నెల 30 వ‌ర‌కు జ‌రిగే ఈ షెడ్యూల్‌తో ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ప‌ల్లెటూరి అమ్మాయి గా ఒక ప్రత్యేక పాత్రలో హీరోయిన్ దిగంగ‌న న‌టిస్తుండ‌గా భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ముఖ్యమైన పాత్రల్లో పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.

Gopichand, Director Sampath Nandi's 'Seetimaarr' Is In It's Climax:

'Seetimaarr' movie is being made with big budget 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ