ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్ టీజ‌ర్

Fri 01st Jan 2021 02:44 PM
fuck movie,jagapathi babu,father-chitti-uma-karthik (fuck) teaser released  ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్ టీజ‌ర్
Father-Chitti-Uma-Karthik (FCUK) teaser released ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్ టీజ‌ర్

ఉత్కంఠ‌త‌ను మ‌రింత పెంచేలా నూత‌న సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా 'ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్' టీజ‌ర్ విడుద‌ల‌

జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి యువ జంటగా ప్ర‌తిష్ఠాత్మ‌క నిర్మాణ సంస్థ‌ శ్రీ రంజిత్ మూవీస్ నిర్మిస్తోన్న 14వ‌ చిత్రం ఫాదర్-చిట్టి-ఉమ- కార్తీక్. టైటిల్‌లోని మ‌రో ప్ర‌ధాన పాత్ర చిట్టిగా బేబి స‌హ‌శ్రిత న‌టిస్తోంది. ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. షార్ట్‌క‌ట్‌లో ఈ సినిమా ఎఫ్‌సీయూకే గా పాపుల‌ర్ అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌కు సంబంధించి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ విల‌క్ష‌ణంగా ఉన్నాయంటూ అన్ని వ‌ర్గాల నుంచీ ప్ర‌శంస‌లు ల‌భించాయి.

నూత‌న సంవ‌త్స‌రారంభం సంద‌ర్భంగా శుక్ర‌వారం (జ‌న‌వ‌రి 1) ఉద‌యం 9 గంట‌ల‌కు సెల‌బ్రిటీల సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. పోస్ట‌ర్స్ ఎంత యూనిక్‌గా ఉన్నాయో, టీజ‌ర్ సైతం అంత యూనిక్‌గా ఉంద‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

ఒక నిమిషం నిడివి క‌లిగిన ఈ ఉత్తేజ‌భ‌రిత‌మైన టీజ‌ర్‌లో నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేయ‌డం క‌నిపిస్తుంది. అయితే ఇక్క‌డ చెప్పుకోవాల్సింది జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబి స‌హ‌శ్రిత (చిట్టి) మ‌ధ్య అనుబంధం గురించి. ఒక ట్రెండ్‌సెట్టింగ్ యూత్‌ఫుల్‌ రొమ్‌కామ్‌గా ఈ సినిమా నిల‌వ‌నున్న‌ద‌నే న‌మ్మ‌కం టీజ‌ర్ క‌లిగిస్తోంది. నాలుగు పాత్ర‌లు.. ఫాద‌ర్‌, చిట్టి, ఉమా, కార్తీక్‌.. ఆ పాత్ర‌ల మ‌ధ్య వినోద‌భ‌రిత అనుబంధం ఉత్తేజాన్ని క‌లిగిస్తూ, సినిమాపై మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా ఇతివృత్తం ఏమిట‌నేది వెల్ల‌డించ‌కుండా ఉత్కంఠ‌త‌ను పెంచుతోంది చిత్ర బృందం. టీజ‌ర్ విడుద‌ల‌వ‌డం, దానిని ప్ర‌శంసిస్తూ టాలీవుడ్ సెల‌బ్రిటీలు కామెంట్లు చేయ‌డంతో ఎఫ్‌సీయూకే గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే కూతుహ‌లాన్ని నెటిజ‌న్లు వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు నిర్మాత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్‌, డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. ఎఫ్‌సీయూకే మూవీ గురించి యువ జంట రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి త‌మ‌ సోష‌ల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకుంటున్న విష‌యాలు బ‌జ్‌ను రెట్టింపు చేస్తున్నాయి.

తారాగ‌ణం: జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం: మాటలు: కరుణాకర్, ఆదిత్య, ఛాయాగ్రహణం: శివ జి. సంగీతం: భీమ్స్ సిసిరోలియో, పాటలు: కరుణాకర్, ఆదిత్య, భీమ్స్, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి, ఆర్ట్: మూర్తి, కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు, నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్, బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

Father-Chitti-Uma-Karthik (FCUK) teaser released:

The magnificent teaser of FCUK (FatherChittiUmaaKaarthik)