టాలీవులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ (56) మృతి. అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి.
నర్సింగ్ యాదవ్ సుమారు రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తనదైన శైలిలో నటించి మెప్పస్తున్నారు. ఆయన జూనియర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వ్యవహరించిన, హేమాహేమీలు, చిత్రంతో వెండితెరకి పరిచయం అయిన ఆయన.. తెలుగు, తమిళ, హిందీ భాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సినిమా క్షణం క్షణంలో నర్సింగ్ చేసిన పాత్రకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు గట్టిగానే వచ్చాయ్.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్ యాదవ్, దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ మృతి చండటం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.