విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో రవితేజ, గోపీచంద్ మలినేని క్రాక్
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం క్రాక్ షూటింగ్ మొత్తం పాటలతో సహా పూర్తయి, సంక్రాంతి కానుకగా విడుదలకు రెడీ అవుతోంది.
ఎగ్జయిటింగ్ అనిపించే లేటెస్ట్ అప్‌డేట్ ఏమంటే, క్రాక్ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన వాయిస్ ఓవర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పోస్టర్ల దగ్గర్నుంచి సాంగ్స్ వరకు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ విషయాలన్నీ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ప్రత్యేకించి, ఎస్. తమన్ సంగీతం సమకూర్చిన పాటలైతే సంగీత ప్రియులను అమితంగా అలరించాయి. నూతన సంవత్సరారంభం సందర్భంగా జనవరి 1న విడుదల చేయనున్న థియేట్రికల్ ట్రైలర్ క్రాక్ పై అంచనాల్ని మరింతగా పెంచబోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాతో రవితేజ, గోపీచంద్ మలినేని ముచ్చటగా మూడోసారి కలిసి పనిచేశారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇదివరకు విడుదల చేయగా బ్లాక్‌బస్టర్ హిట్టయిన భూమ్ బద్దల్ స్పెషల్ సాంగ్‌లో రవితేజతో కలిసి అప్సరా రాణి స్టెప్పులేశారు.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.
ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
తారాగణం:రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి.