Advertisementt

ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ లోగో లాంఛ్

Tue 29th Dec 2020 03:37 PM
lb entertainment,lb entertainment launch  ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ లోగో లాంఛ్
LB Entertainments logo launch ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ లోగో లాంఛ్
Advertisement
Ads by CJ

రాధేశ్యామ్ దర్శకుడి చేతుల మీదుగా ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ లోగో లాంఛ్

తెలుగు పరిశ్రమ నిర్మాతలకు కల్పతరువు. సరైన కథలు, మంచి నిర్మాణ విలువలు ఉన్న సంస్థలకు తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ వేస్తుంది. స్టార్స్ కూడా  ఇలాంటి నిర్మాణ సంస్థలతో పనిచేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. రాహుల్ చౌదరి సారథ్యంలో ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ అనే ఓ కొత్త నిర్మాణ సంస్థ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న రాధేశ్యామ్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ చేతుల మీదుగా ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మాట్లాడుతూ.. రాహుల్ చౌదరి డైనమిక్ పర్సన్. ఆయన బ్యానర్ ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ లో వచ్చే సినిమాలన్నీ అద్భుత విజయాలు సాధించాలి. తెలుగులో ప్రామిసింగ్ నిర్మాతగా అతి తక్కువ సమయంలోనే పేరు తెచ్చుకోవాల‘ని ఆకాక్షించారు.

ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణకు నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సినీ, సీరియల్ నటి సుహాసినితో పాటు మరికొందరు నిర్మాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ బ్యానర్ లో వచ్చే సినిమాలన్నీ అద్బుత విజయం సాధించాలని.. పరిశ్రమలోని పెద్ద స్టార్స్ అందరితో ఎల్.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించారు.

నిర్మాత రాహుల్ చౌదరి మాట్లాడుతూ.. అభిరుచితో కూడిన కథలు, అత్యున్నత నిర్మాణాత్మక విలువలకు పెద్ద పీట వేస్తూ ఈ సంస్థ నుంచి త్వరలోనే సినిమాలు రాబోతున్నాయి. ప్రథమంగా భారీ ప్రాజెక్ట్స్ కే ప్రాధాన్యం ఇవ్వబోతున్నాం. వీలైనంత త్వరలోనే మా బ్యానర్ పేరు పరిశ్రమలో మార్మోగుతుంది.. అని తెలియజేశారు.

LB Entertainments logo launch:

All the upcoming movies in LB Entertainment should be amazing successes

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ