టాలీవుడ్ క్రేజీ గర్ల్.. సమంత ఎన్నడూ లేనంతగా గ్లామర్ డోస్ పెంచేసింది. ప్రస్తుతం ఆమె హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సమంత హద్దులు దాటినా గ్లామర్ ఫోజులతో అందరి మతులు పోగొడుతుంది.. ఎందుకు? ఇప్పుడు అందరిలో ఇదే ప్రశ్? ఎన్నడూ లేనంతగా సమంత లో ఎందుకు ఇంత మార్పు.. అసలు సమంత ఇంతలా గ్లామర్ షో చేయాల్సిన అవసరం ఉందా? అసలు దానికి కారణం ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు.. జనాలు!!
నిజమే సమంత స్టార్ హీరోయిన్ గా సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.. అది అందరికి తెలుసు.. స్టార్ హీరోయిన్ గా బిజి షెడ్యూల్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేసినప్పుడు చేయని గ్లామర్ షో ఇప్పుడు ఎందుకు చేస్తుంది అన్నది అసలు ప్రశ్న? స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలోనే హీరో నాగ చైతన్య తో ప్రేమాయణం సాగించి.. ఆ తరువాత తొందరగా పెళ్లి చేసుకుంది సామ్. మరి పెళ్లయిన అమ్మాయిలను ఎవరు పట్టించుకుంటారు? ఒకవేళ వాళ్లతో సినిమాలు చేసిన కూడా జనాలు చూడరు అన్న అపవాదు ఉంది!! అందుకేనేమో పెళ్లి తరువాత సమంతకు పెద్దగా అవకాశాలు రాలేదు ? పెళ్లికి ముందు కమిట్ అయిన రంగస్థలం సినిమాలో నటిగా ప్రూవ్ చేసుకున్నా కూడా ఆమెకు పెద్దగా కొత్త ఛాన్సులేవి రాలేదు. దాంతో తన స్నేహితురాలు నందిని రెడ్డి తో కలిసి ఓ కొరియన్ సినిమాను ఓ బేబీ పేరుతొ రీమేక్ చేసి మంచి మార్కులే తెచ్చుకున్నప్పటికీ సమంత ఊహించిన క్రేజ్ మాత్రం దక్కలేదు.. ఇప్పుడు సమంత అంటే మినిమమ్ రేంజ్ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడం లేదన్నది అందరికి తెలిసిన నిజం!!
ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్న సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి రెడీ ఉందని టాక్? అది కాకుండా ఈ మద్యే ఓటిటి లో అటు హోస్ట్ గా మారిన సమంత మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధం అవుతుంది.. ఈ నేపథ్యంలో ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలంటే.. గ్లామర్ డోస్ తప్పదు. అందుకె ఎన్నడూ లేనంతగా, అందరికి షాకిచ్చేలా ఈ గ్లామర్ డోస్ పెంచేసిందనే టాక్ పరిశ్రమలో వినిపిస్తుంది. అయితే అది ఓ బ్రాండ్ కోసం అన్న విషయం అర్థం అవుతుంది.. కానీ ఎన్నడూ లేనంత గ్లామర్ డోస్ మాత్రం.. నెక్స్ట్ ఛాన్సులకోసమే అన్న టాక్ వినిపిస్తుంది మరి.