ప్రతి రోజు పండగే సినిమా వచ్చి ఏడాది గడిచినా దర్శకుడు మారుతి కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. మారుతికి స్టార్ రేంజ్ హీరోలతో సినిమాలు చెయ్యాలని ఉంటుంది..కానీ మారుతికి అవకాశం ఇచ్చే స్టార్ హీరో లేరు. అందుకే రవితేజ కోసం ఓ కథ సిద్ధం చేసుకుని రవితేజ తో కమిట్ చేయించుకున్న మారుతి సినిమాని గీత ఆర్ట్స్ అండ్ యువి క్రియేషన్స్ వారు కలిపి నిర్మిస్తారని అన్నారు. అయితే మొన్నీమధ్యనే మారుతి - రవితేజ సినిమా ఆగిపోయింది అనే టాక్ మొదలైంది. కారణాలు రవితేజ పారితోషకం విషయంలో పేచీలు రావడంతో ఆ కథలోకి గోపీచంద్ వచ్చాడని అన్నారు.
రవితేజ తో మారుతి పక్కా కమర్షియల్ టైటిల్ తో సినిమా అనుకున్నాడు. ఇపుడు ఆ టైటిల్ కి గోపిచంద్ వచ్చిచేరాడని అంటున్నారు. కానీ మారుతి కి మాత్రం రవితేజాతోనే సినిమా చేయాలని ఉందట. రవితేజ 12 కోట్లు డిమాండ్ చేసాడని నిర్మాతలు రవితేజని లైట్ తీసుకుని గోపీచంద్ ని రంగంలోకి దింపారు. కానీ మారుతికి మాత్రం రవితేజా కావాలి. అందుకే రవితేజ కోసం మారుతి ఇప్పుడు తన పారితోషకం నుండి నిర్మాతలు ఇవ్వలేమని చెబుతున్న డబ్బుని సర్దుబాటు చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. తన కథకి రవితేజని పక్కా కమర్షియల్ గా ఉంటాడని నమ్మిన మారుతి రవితేజ కోసం పారితోషకంలో త్యాగానికి సిద్దపడినా మారుతి -రవితేజ కాంబో పట్టాలెక్కడం డౌట్ గానే కనబడుతుంది అంటున్నారు.