పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలతో ఫార్మ్ లోకొచ్చేసాడు. అయినా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసే అవకాశం కోసం దర్శక నిర్మాతలు కాదు.. ఆఖరికి హీరియిన్స్ కి కూడా ఆసక్తి ఉంది. పవన్ పక్కన నటించాలంటే అదృష్టం ఉండాలి అన్న రేంజ్ లో ఉంది ప్రస్తుతం పవన్ క్రేజ్. సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు అంతే కానీ.. సినిమాల్లో పవన్ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. అందుకే పవన్ క్రేజ్ కి సరిపోయే హీరోయిన్స్ ఎంపికతోనే పవన్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు దర్శకులు.
తాజాగా పవన్ రేంజ్ కి ఓ హీరోయిన్ పనికిరాలేదనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగులో చిన్న చిన్న అవకాశాలకే పరిమితమైన ఒకప్పటి టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. అందుకే స్టార్ హీరోలెవరూ రకుల్ వైపు చూడడం లేదు. కానీ రకుల్ కి బాలీవుడ్ లో సీనియర్ హీరోస్ అవకాశాలు ఇస్తున్నా తెలుగు హీరోలు ఆల్మోస్ట్ రకుల్ ని పక్కనబెట్టినట్టే. అందుకే దర్శకుడు క్రిష్ కూడా రకుల్ రేంజ్ పవన్ పక్కన పనికిరాదని డిసైడ్ అయ్యాడట. రకుల్ కి పవన్ సినిమాలో అవకాశం వచ్చేసింది అన్నారు.
పవన్ - క్రిష్ కాంబోలో రకుల్ హీరోయిన్ ఫైనల్. రకుల్ కూడా పాపం అదే కలలు కనింది. కానీ క్రిష్ రకుల్ కి షాకిచ్చాడనే టాక్ మొదలైంది. ప్రస్తుతం నీ రేంజ్ జస్ట్ కొత్త హీరో వైష్ణవ తేజ్ కే సరిపోతుంది అన్నట్టుగా మెగా మేనల్లుడు సెకండ్ మూవీలో రకుల్ ప్రీత్ కి ఛాన్స్ ఇచ్చిన క్రిష్ పవన్ సినిమా విషయంలో రకుల్ ని పక్కన పెట్టేసాడనే టాక్ ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం లోకి వచ్చింది. వైష్ణవ తేజ్ తో కొండ గట్టు నవల ఆధారంగా తెరకెక్కిన ఓ లోబడ్జెట్ మూవీలో రకుల్ నటించిన విషయం తెలిసిందే..