ఏ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి దక్కని అవకాశాల జోరు ఈ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి దక్కింది. చిరు వరాల జల్లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని గాల్లో ఎగిరేలా చేస్తుంది. కసితో ఆటాడిన కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఇండస్ట్రీలో వెండితెర అవకాశాలు బుల్లితెర అవకాశాల జోరు మాములుగా లేదు. ఇప్పటికే సోహైల్ హీరోగా సినిమా మొదలవ్వగా.. మోనాల్ డాన్స్ ప్లస్ షో లో అదరగొడుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి చిరు దేవుడిలా కనబడుతున్నాడు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ మీద కంటెస్టెంట్స్ కి వరాల జల్లు కురిపించిన చిరు ని అందరూ దేవుడిలా పూజించేస్తున్నారు.
దివి కి వేదాళం లో సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రకి ఆఫర్ ఇచ్చిన చిరు మెహబూబ్ లో తనని తాను చూసుకున్నా అన్నాడు. అలాగే మెహబూబ్ కి డబ్బు హెల్ప్ కూడా చేసాడు. అయితే మెహబూబ్ కి ఆ స్టేజ్ మీద ఎలాంటి సినిమా అవకాశం ఇవ్వకపోయినా ప్రస్తుతం చిరు తన ఆచార్య సినిమాలో మెహబూబ్ కి ఓ పాత్ర ఇచ్చాడనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ నడుస్తుంది. కొరటాల చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ కి ఓ పాత్ర చేస్తున్నాడనేది న్యూస్. దానితో నిజంగా చిరు దేవుడు అంటున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్