ప్రసుతం కన్నడ పాప రష్మిక జోరు టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాక పాకింది. రష్మిక లక్కీ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలే కాదు.. కథకు ప్రాధాన్యముండే యంగ్ హీరోస్ తోనూ సినిమాలు చేస్తుంది. టాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిన రష్మిక కోలీవుడ్ లోను సినిమాలతో బిజీ. మధ్యలో బాలీవుడ్ లో రష్మిక జోరు స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ పుష్ప స్టార్ట్ అవ్వకముందే రష్మిక బాలీవుడ్ లో అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మిక హీరోయిన్.
ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీలో రష్మిక కీ రోల్ పోషిస్తున్నట్టుగా టాక్. అది కూడా బాలీవుడ్ మెగాస్టర్ అమితాబచ్చన్ సినిమాలో రష్మిక నటించబోతుందట. వికాస్ భల్ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రధారిగా రూపొందే సినిమాలో నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం తల్లి కూతుళ్ళ అనుబంధం చుట్టనే తిరుగుతుంది అని.. అమితాబ్ కూతురుగా రష్మిక కనిపిస్తుంది అని, అమితాబ్ కి రష్మిక మధ్యన ఎమోషనల్ సన్నివేశాలు, అనుబంధాలు అన్ని సినిమాకే హైలెట్ అనేలా ఉండబోతున్నాయట. మరి రష్మిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. అలాగే తెలుగు, కన్నడ, తమిళ, బాలీవుడ్ లలో దున్నేస్తున్న ఏకైన స్టార్ హీరోయిన్.