Advertisementt

పవన్ సినిమాలో రకుల్ కదా..!

Mon 28th Dec 2020 08:28 AM
pawan kalyan,krish,rakul preet singh,bollywood  పవన్ సినిమాలో రకుల్ కదా..!
Pawan Kalyan - Krish combo Rakul Preet Singh is the heroine పవన్ సినిమాలో రకుల్ కదా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కనున్న జానపద చిత్రం షూటింగ్ సెకండ్ షెడ్యూల్ ఈ నెలలోనే మొదలవ్వాల్సి ఉండగా.. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ వలన జనవరి పోస్ట్ పోన్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ వల్ల సినిమా లేట్ అవడం కన్నా ఇప్పుడు పవన్ సినిమా కోసం క్రిష్ వేయించిన సెట్స్ నిర్మాణం మళ్ళీ చేపట్టిన కారణంగానే క్రిష్ - పవన్ సినిమా లేట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చేసే సినిమా కోసం క్రిష్ ఫిబ్రవరిలోనే అల్యూమినియం ఫ్యాకటరీలో ఓ సెట్ ని నిర్మించగా అది ఇప్పుడు లాక్ డౌన్ వల్ల వాడకపోవడం, అలాగే భారీ వర్షాలకు సెట్ నిర్మాణం దెబ్బతినడంతో.. మళ్ళీ ఆ సెట్ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. అందుకే క్రిష్ తో పవన్ సినిమా కొద్దిగా లేట్ అవుతుందట. మరోపక్క క్రిష్ పవన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ వేటలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ముందు రకుల్ ప్రీత్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అందుకే క్రిష్ వైష్ణవ తేజ్ సినిమాలో రకుల్ ని తీసుకున్నాడనే టాక్ నడిచింది. అయితే క్రిష్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం రకుల్ ప్రీత్ ని అనుకోలేదట. ఎందుకంటే రకుల్ ప్రీత్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడమే కాదు.. తెలుగులోనూ రెండు సినిమాలు చేస్తుంది. అందుకే రకుల్ ని అసలు క్రిష్ పవన్ సినిమా కోసం సంప్రదించలేదట. మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం క్రిష్ ఏ భామని తీసుకొస్తాడో గాని.. ఈ సినిమాలో అయితే రకుల్ కాదంటున్నారు.

Pawan Kalyan - Krish combo Rakul Preet Singh is the heroine:

Rakul Preet is busy with Bollywood movies

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ