రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో సీతమ్మ పాత్ర చేస్తున్న అలియా భట్ పై బాలీవుడ్ లో కేసు నమోదు అయ్యింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ తో పాటుగా బాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తుంది. బ్రహ్మాస్త్ర తో పాటుగా చారిత్రాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో గంగూబాయ్ కతియావాడి సినిమాలో నటిస్తుంది. అయితే సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలంటేనే కాంట్రవర్సీలకు వేదిక. గతంలో దీపికా తో చేసిన పద్మావత్ సినిమా అనేక వివాదాలను దాటుకుని విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.
తాజాగా లేడీ డాన్‌గా ముంబై మాఫియా సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రతేకతను చాటుకున్న గంగూబాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న గంగూబాయ్ కతియావాడి సినిమాలో అలియా భట్ టైటిల్ రోల్ చేస్తుంది. ముంబైలోని కామతిపుర ప్రాంతానికి చెందిన వేశ్యగృహాలకు అధిపతి అయిన గంగూబాయ్ అనే మహిళ జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా పోలీస్ కేసు పెట్టాడు. దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ పై, టైటిల్ రోల్ పోషిస్తున్న అలియా భట్ పై అలాగే సినిమా నిర్మాణ సంస్థపై బాబూజీ రాజీ షా పోలీస్ కేసు పెట్టాడు. సినిమా షూటింగ్ ఆపాలంటూ బాబూజీ రాజీ షా కేసు పెట్టడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.