Advertisementt

ఆచార్య కోసం అప్పుడేనా..?

Sun 27th Dec 2020 05:50 PM
acharya movie,ramcharan,chiranjevi  ఆచార్య కోసం అప్పుడేనా..?
Charan in Acharya sets ఆచార్య కోసం అప్పుడేనా..?
Advertisement
Ads by CJ

చిరంజీవి - కొరటాల కాంబోలో తెరకెక్కబోతున్న ఆచార్య సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఆచార్య సినిమా సెట్స్ నుండి చిరు న్యూ లుక్ లీక్ కావడం అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మెగా ఫాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. చిరు ఆచార్య లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. అయితే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటించబోవడంతో ఆ సినిమాపై అంచనాలు అందుకోలేనంతగా ఉన్నాయి. చరణ్ ఎప్పుడు ఆచార్య సెట్స్ లోకి అడుగు పెడతాడు అని మెగా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా చరణ్ ఆచార్య సెట్ లో డుగుపెట్టినట్లుగా సమాచారం. మరి RRR షూటింగ్ తో బిజీగా వున్న చరణ్.. అప్పుడే ఆచార్య సెట్ కి వచ్చేసాడా.. మరి లుక్ సంగతి ఏంటి అప్పుడే అందరిలో అనుమానాలు మొదలైపోయాయి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ RRR లో కోర మీసం లో కత్తిలా ఉన్నాడు. కానీ ఆచర్యలో మరో లుక్ లోకి మారాల్సి ఉంటుంది. RRR షూటింగ్ మధ్యలోనే ఆచార్య సెట్స్ లోకి చరణ్ వచ్చేసాడా అంటున్నారు అభిమానులు. అయితే రామ్ చరణ్ నిర్మాతగా ఆచార్య సెట్ కి వచ్చాడా..లేదంటే షూటింగ్ లో జాయిన్ అయ్యాడా అనేది మాత్రం క్లారిటీ లేదు కానీ. చరణ్ ఆచార్య సెట్ లోకి వచ్చిన విషయం మాత్రం వైరల్ అయ్యింది.

Charan in Acharya sets:

Chiru-Koratala combo movie shooting in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ