Advertisementt

పూజ ఓకె.. కానీ రశ్మికనే..?

Sun 27th Dec 2020 05:39 PM
pooja hegde,rashmika-mandanna  పూజ ఓకె.. కానీ రశ్మికనే..?
Pooja ok, but what about Rashmika..? పూజ ఓకె.. కానీ రశ్మికనే..?
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చిన హీరోయిన్. బాలీవుడ్ లో ప్లాప్ అయిన వెంటనే సౌత్ కే వచ్చి సెటిల్ అయ్యింది. ఇక్కడ టాప్ హీరోయిన్ అయ్యింది. సౌత్ లో టాప్ రేంజ్ కి చేరుకోగానే బాలీవుడ్ పై కన్నేసింది. అక్కడ కూడా పూజ గత ఏడాది సక్సెస్ అయ్యింది. ఈ ఏడాది స్టార్ హీరోలతో బాలీవుడ్ లో చెప్పలేనంత బిజీ అయ్యింది. రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లతో సినిమాలతో పూజ బాలీవుడ్ లోను టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయంగానే ఉంది. అంటే సౌత్ లోను టాప్ అలాగే బాలీవుడ్ లోను సక్సెస్ అయ్యింది. మరి మరో తెలుగు టాప్ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కుతుంది. 

తెలుగులో పాన్ ఇండియా మూవీస్ తో దూసుకుపోతున్న రష్మిక బాలీవుడ్ లో దున్నేస్తుందా.. తెలుగు తమిళంలో దూసుకుపోతున్న రష్మిక బాలీవుడ్ ఎంట్రీ విషయం రష్మిక చెప్పేవరకు ఎవరికీ తెలియదు. తెలుగులో చాలా త్వరగా సక్సెస్ అయిన రష్మిక తమిళంలో కూడా స్టార్ రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తుంది. సౌత్ లో టాప్ బ్యూటీ బాలీవుడ్ లో కూడా సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. కాజల్, త్రిష, తమన్నా లాంటి వాళ్ళు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా వాళ్ళు అక్కడ అంతగా నిలదొక్కుకోలేక మళ్లీ సౌత్ కె వచ్చేసారు. మరి పాన్ ఇండియా మూవీ చేస్తున్న రష్మిక బాలీవుడ్ లో స్ట్రయిట్ గా సక్సెస్ అయితే టాలీవుడ్ కోలీవుడ్ శాండల్ వుడ్, బాలీవుడ్ అంటూ సినిమాల మీద సినిమాలు చెయ్యడం ఖాయం.

Pooja ok, but what about Rashmika..?:

Rashmika is entering in Bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ