Advertisementt

జ‌న‌వ‌రి 15న 'అల్లుడు అదుర్స్'

Sun 27th Dec 2020 04:49 PM
alludu adhurs movie,alludu adhurs stills,alludu adhurs release on january 15th,santhosh srinivas,subrahmanyam gorrela,bellamkonda sai srinivas,nabha natesh,anu emmanuel,prakash raj,sonu sood  జ‌న‌వ‌రి 15న 'అల్లుడు అదుర్స్'
Alludu Adhurs to Release On January 15th జ‌న‌వ‌రి 15న 'అల్లుడు అదుర్స్'
Advertisement
Ads by CJ

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, సంతోష్ శ్రీ‌నివాస్ చిత్రం 'అల్లుడు అదుర్స్' జ‌న‌వ‌రి 15న విడుద‌ల‌

'రాక్ష‌సుడు' లాంటి సూప‌ర్ హిట్ మూవీ త‌ర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీ‌నివాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. సుమంత్ మూవీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌లో ఉంది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 15న థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

పండ‌గ సీజ‌న్ల‌లో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చూసేందుకు ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డ‌తారు. ఈ సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్' చిత్రం వారికి స‌రైన చాయిస్ అని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు. బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్ స‌ర‌స‌న నాయిక‌లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్, వెన్నెల కిశోర్‌, స‌త్యా కీల‌క పాత్ర‌ధారులు.రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం: బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్‌, వెన్నెల కిశోర్‌, స‌త్యా.

సాంకేతిక బృందం: స‌మ‌ర్ప‌ణ‌: ర‌మేష్ కుమార్ గంజి, మ్యూజిక్‌: దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ: చోటా కె. ప్ర‌సాద్‌, ఎడిటింగ్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌: అవినాష్ కొల్లా, యాక్ష‌న్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌,  డైరెక్ట‌ర్‌: స‌ంతోష్ శ్రీ‌నివాస్‌, నిర్మాత: సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల‌.

Alludu Adhurs to Release On January 15th:

Alludu Adhurs movie shooting is nearly completed.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ