కూల్ గా ఉండి.. మెచ్యురిటిగా బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడిన అభిజిత్.. టాస్క్ విషయంలో ఎలా ఉన్నా బిగ్ బాస్ విన్నర్ అయ్యి అందరి మనసులని గెలిచాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో వెండితెరకి వెల్ కం చెప్పిన అభిజిత్ తర్వాత అవకాశాలు రాకో.. లేదంటే చిన్న చిన్న అవకాశాలు ఎందుకు అనుకున్నాడో ఏకంగా ఎనిమిదేళ్లు ప్రేక్షకులకు దూరమయ్యాడు. మళ్ళీ బిగ్ బాస్ తో క్రేజుకి క్రేజ్, ఫేమ్ కి తెచ్చుకున్న అభిజిత్ ఇప్పుడు అంటే బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక పలు ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తూ గడిపేస్తున్నాడు కానీ.. తనకి వచ్చిన అవకాశాల గురించి మట్లాడడం లేదు. అభిజిత్ కి మూడు సినిమా ఆఫర్స్ ఉన్నాయన్నారు కానీ ఎక్కడా క్లారిటీ లేదు.
మరోపక్క సోహైల్ హీరోగా సినిమా మొదలయ్యింది. సోహైల్ స్పీడుకి అభిజిత్ విల విలా అంటున్నారు. కానీ అభిజిత్ తనకొచ్చిన ఫేమ్ ని వృధా చెయ్యకుండా కూల్ గా అలోచించి స్టెప్ వెయ్యాలని డిసైడ్ అయ్యాడట. అందుకే తనకొచ్చిన ఆఫర్స్ పట్టాలెక్కవరకు చెప్పకూడదని అనుకుంటున్నాడట. గతంలో బిగ్ బాస్ విన్నర్స్ చేసిన తప్పుని చెయ్యకుండా.. కూల్ గా ఆలోచింది డెసిషన్ తీసుకోవాలని చూస్తున్నాడట. అంటే బిగ్ బాస్ హౌస్ లో ఎలా మైండ్ తో గేమ్ ఆడాడో.. ఇప్పుడు సినిమాల ఆఫర్స్ విషయంలోనూ తొందరపడకుండా కూల్ గానే అదను చూసి అటాడాలని అభిజిత్ చూస్తున్నాడట. మరి అభిజిత్ ని లవర్ బాయ్ లా చూడాలని ఆయన అభిమానుల కోరిక. అదను కోసం ఎదురుచూస్తున్న అంటున్న అభిజిత్ ఎప్పటికి తీరుస్తాడో చూడాలి.