ఇస్మార్ట్ శంకర్ తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి రెడ్ సినిమాతో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు.
నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ ఈరోజే సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది . దేవదాసు, మస్కా తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. రామ్ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో.. ఈ అంశాలన్నీ సినిమాలోఉంటాయి.ఇస్మార్ట్
శంకర్ కి సూపర్ డూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చిన మణిశర్మ, రెడ్ కి కూడా బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చారు. థియేటర్లలో సినిమాను విడుదల చేయాలనే
సంకల్పంతో, ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలనే మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రయిలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది. అన్ని థియేటర్స్ లోను ట్రైలర్ ప్రదర్శితమవుతూ ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తోంది అని అన్నారు.