కొత్త సంవత్సరం సందర్భంగా.. జనవరి 1న థియేటర్స్‌లో విడుదలవుతున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు యాక్షన్ ఎంటర్‌టైనర్ వి.
నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు హీరోలుగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీశ్, హర్షిత్ రెడ్డి నిర్మించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వి. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్. నాని నటించిన 25వ చిత్రమిది. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్స్ మూతపడటంతో సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు. భారతదేశం సహా 200 దేశాలు, టెర్రిటోరియాస్ లో ఉన్న ప్రైమ్ ప్రేక్షకులు సెప్టెంబర్ 5 న విడుదలైన వి చిత్రాన్ని ఎంజాయ్ చేశారు. సూపర్‌డూపర్ టాక్‌తో తెలుగు ప్రేక్షకులను డిజిటల్ మాధ్యమంలో ఆకట్టుకుంది వి చిత్రం. ఇప్పుడు కొత్త సంత్సరం 2021 ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జనవరి 1న వి చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఈ సందర్భంగా..
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావు హైదరి కాంబినేషన్‌లో మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో చేసిన వి సినిమాను కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా సినిమా కోసం ఎదురుచూశారో.. అదే విధంగా ఆదరించారు. నాని 25వ సినిమా ఇది. ఎంతో ప్రెస్టీజియస్‌గా, రిచ్‌గా తెరకెక్కించాం. కానీ థియేటర్స్‌లో సినిమాను విడుదల చేయలేకపోయామనే ఆలోచన ఉండిపోయింది. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఎంతో సంతోషించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో రాబోయే కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అందరూ బావుండాలని కోరుకుంటూ జనవరి 1న వి సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూస్తే ఉండే ఫీల్ వేరుగా ఉంటుంది అన్నారు.
న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ డిసెంబర్ 31న థియేటర్‌లలో ఒరేయ్ బుజ్జిగా..
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఒరేయ్ బుజ్జిగా.. ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న థియేటర్‌లలో విడుదలవుతుంది. ఈ సందర్భంగా..
చిత్రనిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర కానుకగా మా బ్యానర్ లో రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబా పటేల్ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఒరేయ్ బుజ్జిగా..ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుదలచేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్ లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31న రావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100% ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఒరేయ్ బుజ్జిగా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.