అల్లరి నరేష్, గిరి పాలిక, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం 'బంగారు బుల్లోడు' జనవరిలో విడుదల
అల్లరి నరేష్ హీరోగా గిరి పాలిక దర్శకత్వంలో రూపొందుతోన్న హిలేరియస్ ఎంటర్‌టైనర్ 'బంగారు బుల్లోడు'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ సరసన నాయికగా పూజా ఝవేరి నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి.
2021 జనవరిలో 'బంగారు బుల్లోడు'ను విడుదల చేయడానికి చిత్రం బృందం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి మంగళవారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఓ మాస్ సాంగ్‌లో డాన్స్ చేస్తున్నట్లు ఆ పోస్టర్‌లో కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చిన ఆడియో త్వరలో విడుదల కానున్నది. చిత్రంలోని పాటలన్నింటినీ రామజోగయ్య శాస్త్రి రచించారు.
అల్లరి నరేష్ కెరీర్‌లో ఓ చక్కని హాస్యభరిత చిత్రంగా 'బంగారు బుల్లోడు' పేరు తెచ్చుకుంటుందని నిర్మాతలు తెలిపారు. టాలీవుడ్‌లోని పలువురు పేరుపొందిన హాస్యనటులు ఈ చిత్రంలో నటించారనీ, వారిపై చిత్రీకరించిన పలు సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వుకునేలా చేస్తాయనీ చెప్పారు.
సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా, ఎం.ఆర్. వర్మ ఎడిటర్‌గా పనిచేస్తోన్న ఈ చిత్రానికి కృష్ణకిశోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తారాగణం:
అల్లరి నరేష్, పూజా ఝవేరి, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, జబర్దస్త్ మహేష్, అనంత్, భద్రం, అజయ్ ఘోష్, సారిక రామచంద్రరావు, రామపత్ర నిత్ర వెలిగొండ శ్రీనివాస్.