Advertisementt

నాని శ్యామ్ సింగ రాయ్ మొదలయ్యింది!

Mon 21st Dec 2020 03:13 PM
nani,shyam singha roy,regular shoot  నాని శ్యామ్ సింగ రాయ్ మొదలయ్యింది!
Nani's Shyam Singha Roy Regular Shoot Commences నాని శ్యామ్ సింగ రాయ్ మొదలయ్యింది!
Advertisement
Ads by CJ

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం శ్యామ్ సింగ రాయ్‌. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.

సోమ‌వారం ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. నాని, నాయిక‌ల్లో ఒక‌రైన కృతి శెట్టిపై టాకీ సీన్లు చిత్రీక‌రిస్తున్నారు.

రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ అఫిషియ‌ల్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో ఓ పిక్చ‌ర్ షేర్ చేసింది చిత్ర బృందం. అందులో ఓ టేబుల్‌పై శ్యామ్ సింగ రాయ్ స్క్రిప్ట్ బుక్‌, దాని ప‌క్క‌నే ఓ టీ క‌ప్పు ఉన్నాయి. ఆ టేబుల్ అవ‌త‌ల చైర్‌లో నాని కూర్చొని ఉన్నాడు. ఆ పిక్చ‌ర్‌తో పాటు రాయ్ స్టార్ట్స్ రోలింగ్‌.. త‌గిన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకుంటూ నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న మా స్పెష‌ల్ మూవీ శ్యామ్ సింగ రాయ్ తొలి ద‌శ షూటింగ్ ప్రారంభించాం అంటూ చిత్ర బృందం పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో రాహుల్ ర‌వీంద్ర‌న్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అభిన‌వ్‌ గోమ‌టం ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు.

నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న ఈ తొలి చిత్రానికి స‌త్య‌దేవ్ జంగా క‌థ‌ను స‌మ‌కూర్చ‌గా, మెలోడీ సాంగ్స్ స్పెష‌లిస్ట్ మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. స‌ను జాన్ వ‌ర్ఘీస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేస్తోన్న శ్యామ్ సింగ రాయ్ ఓ మాస్ట‌ర్‌పీస్‌గా రూపొందుతోంద‌నే అభిప్రాయం అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది.

Nani's Shyam Singha Roy Regular Shoot Commences:

Nani's Shyam Singha Roy Regular Shoot Commences

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ