Advertisementt

టైటిల్‌కి తగ్గట్టే.. షూట్ చేస్తున్నారండోయ్!

Thu 17th Dec 2020 01:13 PM
gaali sampath,final schedule,january,anil ravipudi,anish director  టైటిల్‌కి తగ్గట్టే.. షూట్ చేస్తున్నారండోయ్!
Gaali Sampath 1st Schedule completed టైటిల్‌కి తగ్గట్టే.. షూట్ చేస్తున్నారండోయ్!
Advertisement
Ads by CJ

బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న చిత్రం ‘గాలి సంప‌త్’. అనిల్ కో-డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా, న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్.. ‘గాలి సంప‌త్‌’గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీ అనీష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఇటీవ‌ల అరుకులో ప్రారంభ‌మైన ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ పూర్త‌య్యింది. 

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎస్. క్రిష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇటీవ‌ల ప్రారంభించిన అర‌కు షెడ్యూల్ పూర్త‌య్యింది. మేం ప్లాన్ చేసిన విధంగా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌పోర్ట్‌తో షూటింగ్ స‌జావుగా సాగింది. ఇప్ప‌టివ‌ర‌కూ 80 శాతం టాకీపార్ట్ పూర్త‌య్యింది. జ‌న‌వ‌రి 18 త‌ర్వాత హైద‌రాబాద్‌లో జ‌రిగే చివ‌రి షెడ్యూల్‌తో షూటింగ్ పూర్త‌వుతుంది. తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఒక డిఫరెంట్ ఎమోషన్‌తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్యూటిఫుల్ జ‌ర్నీగా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు.

న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి,

క‌థ‌: ఎస్‌. క్రిష్ణ‌,

స్క్రీన్ ప్లే: అనిల్ రావిపూడి,

ర‌చ‌నా స‌హ‌కారం: ఆదినారాయ‌ణ‌,

సినిమాటోగ్ర‌ఫి: సాయి శ్రీ రామ్‌,

సంగీతం: అచ్చు రాజ‌మ‌ణి,

ఆర్ట్‌: ఎ ఎస్ ప్ర‌కాశ్‌,

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: నాగ‌మోహ‌న్ బాబు. ఎమ్‌,

మాట‌లు: మిర్చి కిర‌ణ్‌,

లిరిక్స్‌: రామ‌జోగ‌య్య శాస్ర్తి,

ఫైట్స్‌: న‌భ‌,

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్, భాను,

మేక‌ప్‌: ర‌ంజిత్‌,

కాస్టూమ్స్‌: వాసు,

చీఫ్ కో డైరెక్ట‌ర్‌: స‌త్యం బెల్లంకొండ‌.

నిర్మాణం: ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్,షైన్ స్క్రీన్స్,

సమ‌ర్ప‌ణ‌: అనిల్ రావిపూడి,

నిర్మాత‌: ఎస్. క్రిష్ణ‌,

ద‌ర్శ‌క‌త్వం: అనీష్

Gaali Sampath 1st Schedule completed:

Gaali Sampath Final Schedule In January

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ