Advertisementt

మహేష్ రౌడిగానా..?

Fri 11th Dec 2020 03:56 PM
mahesh babu,vamsi paidipally,next film,state rowdy  మహేష్ రౌడిగానా..?
Is Mahesh a rowdy ..? మహేష్ రౌడిగానా..?
Advertisement
Ads by CJ

మహేష్ బాబు పోకిరి సినిమాలో రఫ్ లుక్ తో చంపేశాడు. మహేష్ పోకిరి లుక్ అప్పట్లో పెద్ద సన్సేషనే. కానీ ఇప్పుడు ఇంత అందగాడు అలాంటి రఫ్ లుక్ అంటే అభిమానులకు నచ్చినా ప్రేక్షకులు తట్టుకోవడం కష్టం, ఇప్పటికే పరశురామ్ సర్కారు వారి పాట సినిమాలో మహేష్ ని రఫ్ గానే చూపించాలని డిసైడ్ అయ్యాడు. 40 ఏళ్ళు దాటినా క్యూట్ గా హ్యాండ్ సమ్ గ ఉండే మహేష్ రఫ్ గా విలన్స్ ని చితకబాదడం ఓకె కానీ.. గెడ్డం పెంచి, హెయిర్ పెంచి మరీ రఫ్ గా కనబడితే కష్టం. కానీ మహేష్ కి అలాంటి లుక్, అలాంటి సినిమా కావాలని మహర్షి దర్శకుడు వంశి పైడిపల్లిని అడిగాడట. సరిలేరు తర్వాత మహేష్ - వంశి సినిమా పట్టాలెక్కాల్సి ఉండగా.. వంశి చెప్పిన కథ నచ్చక మహేష్ పరశురామ్ తో సర్కారు వారి పాట చేస్తున్నాడు.

సర్కారు వారి పాట తర్వాత మహేష్.. గతంలో వంశీకి మాటిచ్చినట్లుగా ఓ సినిమా ప్లాన్ చేసాడట. ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ గా కనిపిస్తాడని.. దానికి తగిన టైటిల్ ని చిరు బ్లాక్ బస్టర్ మూవీ అయిన సెట్ రౌడీ టైటిల్ ని అనుకుంటున్నారట.  చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్టేట్ రౌడీ టైటిల్ తో మహేష్ దుమ్ములేపడం ఖాయమని మహేష్ ఫాన్స్ అంటున్నారు. కానీ నెటిజెన్స్ చిరు టైటిల్ ని చెడగొట్టకుండా ఉంటె చాలంటుంటే..  మహేష్ - వంశి కాంబో ఓకె అయినా టైటిల్ విషయంలో మాత్రం ఇది ఒక పెద్ద రూమర్ అంటున్నారు కొందరు. 

Is Mahesh a rowdy ..?:

Mahesh Babu next film to be named to State Rowdy?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ