Advertisementt

ఒంగోలులో సాయిరామ్ శంక‌ర్ 'రిసౌండ్' షూటింగ్‌

Fri 11th Dec 2020 03:30 PM
sai ram shankar,resound movie,ongole  ఒంగోలులో సాయిరామ్ శంక‌ర్ 'రిసౌండ్' షూటింగ్‌
Resound Movie Shooting in Ongole ఒంగోలులో సాయిరామ్ శంక‌ర్ 'రిసౌండ్' షూటింగ్‌
Advertisement
Ads by CJ

సాయిరామ్ శంక‌ర్ హీరోగా రిసౌండ్ అనే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్‌.ఎస్‌. ముర‌ళీకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్య‌ప్ప‌రాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు.

ఇదివ‌ర‌కు లాక్‌డౌన్ అనంత‌రం హైద‌రాబాద్‌లో షూటింగ్ పున‌రుద్ధ‌రించి, కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జ‌రుగుతోంది. ఈ షెడ్యూల్‌లో కొన్ని ప్ర‌ధాన ఘ‌ట్టాల‌తో పాటు రెండు పాట‌ల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది.

రిసౌండ్ టైటిల్‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. ఇందులో ఓవైపు ఎంట‌ర్‌టైన్ చేస్తూ, మ‌రోవైపు యాక్ష‌న్‌తో అల‌రించే పాత్ర‌ను సాయిరామ్ శంక‌ర్ చేస్తున్నారు.

సాయిప్ర‌కాష్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగ‌స్తి సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.

తారాగ‌ణం:

సాయిరామ్ శంక‌ర్‌, రాశీ సింగ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, అర‌వింద్ కృష్ణ‌, అజ‌య్ ఘోష్‌, కాశీ విశ్వ‌నాథ్‌, అదుర్స్ ర‌ఘు, పింకీ

Resound Movie Shooting in Ongole:

Sai ram Shankar Resound Movie Shooting in Ongole

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ