Advertisementt

సుమంత్ తో అన‌సూయ అన‌సూయా.. పాట!

Wed 09th Dec 2020 06:36 PM
jai sena movie,samudra,hero sumanth,anasuya.. anasuya lyrical video song,jai sena movie  సుమంత్ తో అన‌సూయ అన‌సూయా.. పాట!
Anasuya Anasuyaa song released by Hero Sumant సుమంత్ తో అన‌సూయ అన‌సూయా.. పాట!
Advertisement
Ads by CJ

హీరో సుమంత్ విడుదల చేసిన సముద్ర `జైసేన`లోని `అన‌సూయ..అన‌సూయ` లిరిక‌ల్ వీడియో సాంగ్‌.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మా రెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి. సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం జై సేన. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాటలకి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి అన‌సూయ‌..అన‌సూయ లిరిక‌ల్ సాంగ్‌ను ఈ రోజు హీరో సుమంత్ విడుద‌ల‌చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో  దర్శకుడు సముద్ర, నిర్మాత వి. సాయి అరుణ్‌ కుమార్‌, న‌టులు శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

హీరో సుమంత్ మాట్లాడుతూ-  స‌ముద్ర గారు నాకు మంచి మిత్ర‌లు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో నేను, శ్రీ‌హ‌రి, అనుష్క క‌లిసి మహానంది సినిమా చేయ‌డం జ‌రిగింది. ఇండస్ట్రీలో నాకు ఇష్ట‌మైన ద‌ర్శ‌కుల్లో స‌ముద్ర గారు ఒక‌రు. ప్ర‌తి ఒక్క‌రితో ఫ్రెండ్లీగా చాలా జోవియ‌ల్‌గా ఉంటారు. నా మ‌న‌సులో ఆయ‌న‌కి ఒక మంచి స్థానం ఉంటుంది. స‌ముద్ర గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైసేన చిత్రంలోని అన‌సూయ‌..అన‌సూయ పాట చూశాను. చాలా బాగుంది. ఈ సినిమా ద‌ర్శ‌కుడిగా స‌ముద్ర‌గారికి మ‌రింత మంచి పేరు తెస్తుంద‌ని ఆశిస్తున్నాను. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌ అన్నారు.

చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ - సుమంత్ బాబుతో మ‌హానంది సినిమా చేయ‌డం జ‌రిగింది. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించింది. బాబుది  చాలా మంచి మ‌న‌స్త‌త్వం అందుకే నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జైసేన సినిమాలోని అన‌సూయ పాట‌ను బాబుతో విడుద‌ల‌చేయించ‌డం జ‌రిగింది. ఈ పాట‌లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసిన శ్రీ కార్తికేయ న‌టించ‌డం జ‌రిగింది. సినిమా బ్ర‌హ్మాండంగా వ‌చ్చింది. హీరోలు కొత్త‌వారైన చ‌క్క‌గా న‌టించారు. వీరితో పాటు శ్రీ‌కాంత్ అన్న‌య్య‌, సునీల్‌, తార‌క‌ర‌త్న‌, శ్రీ‌రామ్‌, శ్రీ‌, పృథ్వి ఇలా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు న‌టించారు. త్వ‌ర‌లో సినిమా విడుద‌ల‌కాబోతుంది. మీ అంద‌రి బ్లెసింగ్స్ ఉండాల‌ని మ‌సస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

అన‌సూయ అన‌సూయ అన‌సూయా.. గుండెజారి గ‌ల్లంత‌య్యి  ప్రేమ‌లో ప‌డిపోయా.. అన‌సూయ అన‌సూయ అన‌సూయా.. నీ అందం చూస్తే ఆడోళ్లందరికి అసూయ‌ అంటూ హుశారుగా సాగే ఈ పాట‌ను ద‌నుంజయ్ ఆల‌పించ‌గా సిరాశ్రీ సాహిత్యం అందించారు. ఎస్‌. రవిశంకర్ మంచి బాణీలు స‌మ‌కూర్చారు. ఈ పాట‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: వాసు, సంగీతం: ఎస్‌. రవిశంకర్‌, ఎడిటింగ్‌: న‌ంద‌మూరి హ‌రి, మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార‌వ‌తిచంద్‌, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ,  డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కన‌ల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: పి.ఆర్. చంద్ర‌యాద‌వ్‌, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేసినేని శ్రీనివాస్‌, స‌మ‌ర్ప‌ణ‌: విజ‌య‌ల‌క్ష్మి, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.

Anasuya Anasuyaa song released by Hero Sumant:

Hero Sumanth Unveiled 'Anasuya.. Anasuya' Lyrical Video Song From 'Jai Sena'

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ