బిగ్ బాస్ సీజన్ 4 మొదలైంది మొదలు నాలుగువారాలు బోర్ కొట్టి బుల్లితెర ప్రేక్షకులు గోల గోల చేశారు. నాగార్జున ఎపిసోడ్స్ తప్ప బిగ్ బాస్ 4 లో చూసేంత ఏముండేది కాదు. వీక్ డేస్ లో బాగా వీక్ గా సాగిన బిగ్ బాస్ చివరి రెండు వారాల్లో కూడా ఎలాంటి ఆసక్తి అనేదే లేకుండా పోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన చాలామంది బయటిక్ వెళ్లిపోగా మోనాల్ లాంటి వారు ఇంట్లోనే ఉన్నారు. అసలు బిగ్ బాస్ లో స్టఫ్ లేక ప్రేక్షకులకు బిగ్ బాస్ పిచ్చ బోర్ కొడుతోంది. అందులోను బిగ్ బాస్ టైమింగ్స్ మార్చడం ఒకటి బుల్లితెర ప్రేక్షకులకు చిరాకు కలిగిస్తుంది. స్టార్ మా కి సీరియల్స్ మీదున్న నమ్మకం బిగ్ బాస్ మీద లేదు. అందుకే సీరియల్స్ కి మంచి టైం స్లాట్ సెట్ చేసి బిగ్ బాస్ తీసుకెళ్లి రాత్రి 10 టు 11 కి మార్చేసింది. అసలు ఈ టైమింగ్స్ బిగ్ బాస్ ప్రేక్షకులకు వర్కౌట్ అయ్యేలా లేదు.
9.30 కి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ చూపించే ప్రేక్షకులు ఇప్పడు 10 గంటల దాక వెయిట్ చెయ్యాలా అనుకుంటున్నారు. మరోపక్క బిగ్ బాస్ షోలో ఎలాంటి ఆసక్తికర టాస్క్ లు లేవు, కంటెస్టెంట్స్ అంతా డల్ గా కనబడుతున్నారు. ఎమోషనల్ గా కనెక్ట్ అయిన వాళ్ళు టాస్క్ ల పరంగా ఇంకేం ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్స్ ని మరో రెండు వారాల పటు చూడాలంటే ప్రేక్షకులకు కష్టమే. అవినాష్ ఉంటే కామెడీ చేసేవాడు. కానీ అవినాష్ ని బయటికి పంపేశారు. ఇప్పుడు సోహైల్ కామెడీ చేసినా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. హరిక అఖిల్ తో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. మోనాల్ లోన్లీ ఫీలవుతుంది. టికెట్ టు ఫినాలేకి వెళ్ళాక అఖిల్ సైలెంట్ అయ్యాడు. అభిజిత్ ఎప్పటిలాగే మౌనంగా ఉంటాడు. ఇక అరియనా హౌస్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తుంది. మొత్తానికి ముగ్గురు మగా, ముగ్గురు ఆడ వాళ్లతో బిగ్ బాస్ హౌస్ గందరగోళంగానూ లేదు. ఏదో యావరేజ్ గా అనిపిస్తుంది తప్ప ఇంట్రెస్ట్ గా లేదు. సో ఈ లాస్ట్ వీక్స్ బిగ్ బాస్ బోర్ మరి ఎక్కువైనట్లు అనిపిస్తుంది.