కరోనా తర్వాత అందరూ సెట్స్ మీద షూటింగ్ చేసుకుంటున్నారు. ఆరేడు నెలల గ్యాప్ కి నిర్మాతలు ఎంత లాస్ అయ్యారో అనే తపన హీరోల్లో కనిపిస్తుంది. ఇక మెగా డాటర్ నిహారిక పెళ్లి హడావిడి రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో మొదలైంది. అయినా చిరు ఇంకా హైదరాబాద్ లోనే ఉన్నాడు. మరోపక్క రాంచరణ్ మహాబలేశ్వర్ లో RRR సెట్స్ నుండి రాజస్థాన్ కి వెళ్ళాడు. కానీ పవన్ ఇంకా రైతులని పరామర్శిస్తూ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. మరో పక్క పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ ని మొదలు పెట్టుకుని పవన్ రాక కోసం వేణు శ్రీరామ్ తో పాటుగా దిల్ రాజు ఎదురు చూస్తున్నారు. అటు రాజకీయాల్లో ఉన్న ఇంట్రెస్ట్ పవన్ సినిమాల మీద కూడా పెడితే నిర్మాతలకు ఇబ్బంది ఉండదు.
దసరా తర్వాత వకీల్ సాబ్ షూటింగ్ స్పాట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు షూటింగ్ వదిలేసి రాజకీయాలంటూ రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. మరో పక్క.. రేపు అన్న కూతురు నిహారిక పెళ్ళికి రాజస్థాన్ వెళ్ళాలి. కానీ పవన్ సినిమాల విషయం పక్కనబెట్టి ఇలా రాజకీయాలకే టైం కేటాయిస్తే మిగతా ఒప్పుకున్న దర్శకనిర్మాత పరిస్థితి ఏమిటో కూడా అర్ధం కావడం లేదు. పవన్ ఇలా అటు పూర్తి రాజకీయాలతోనో, లేదంటే సినిమాలతోనో టైం గడపకుండా ఇలా కొద్దిగా రాజకీయాలు,కొద్దిగా సినిమా షూటింగ్స్ అంటూ అందరిని హడావిడి చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఇలా అయితే చాలా కష్టం. పవన్ ఇది గమనిస్తే బావుంటుందని దర్శక నిర్మాతల మనసులో వున్న మాట.