Advertisementt

పిక్ టాక్: 32 ఏళ్ళ అమ్మ నిశ్చితార్ధపు చీరలో నిహారిక!

Sun 06th Dec 2020 04:53 PM
niharika,pettu saree,mother,padmaja,engagement saree,niharika wedding  పిక్ టాక్: 32 ఏళ్ళ అమ్మ నిశ్చితార్ధపు చీరలో నిహారిక!
Niharika - Remodelling Her Mother's 32 Year Old Engagement Saree పిక్ టాక్: 32 ఏళ్ళ అమ్మ నిశ్చితార్ధపు చీరలో నిహారిక!
Advertisement
Ads by CJ

నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబెషన్స్ రాజస్థాన్ లోని ఉదయపూర్ ఉదయ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళ స్నానాల దగ్గరనుండి.. మెహిందీ, సంగీత్ వేడులకు ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాళ్ళు. ఇప్పటికే నిహారిక పెళ్లి వేడుకల్లో చిరు భార్య సురేఖ, అక్కలు మెగా స్టార్ డాటర్స్ శ్రీజ, సుస్మితలు వాళ్ళ పిల్లలు అందరూ రకరకాల డిజైనర్ వెర్ సారీస్ తోనూ, పట్టు చీరలతో ప్యాలెస్ మొత్తం హడావిడి చేస్తున్నారు. తమ తమ భర్తలతో కలిసి చిట్టి చెల్లి నిహారిక వెడ్డింగ్ ఫంక్షన్స్ తో కలియ తిరుగుతున్నారు. ఇక పెళ్లి కూతురు నిహారిక రోజుకో పట్టు చీర లో మెరిసిపోతూ సిగ్గులు మొగ్గలవుతుంది.

తాజాగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా తన తల్లి పద్మజ కొణిదెల నిశ్చితార్ధపు చీరని తాను కట్టుకుని పెళ్లి కూతురులా ముస్తాబైంది. 32 ఏళ్ళ క్రితం తన తల్లి పద్మజ.. తండ్రి నాగబాబుతో జరిగిన నిశ్చితార్థంలో కట్టుకున్న పట్టు చీరని.. నేడు నిహారిక తన పెళ్లి వేడుకల్లో ధరించి మురిసిపోతుంది. ప్రత్యేకమయిన డిజైనర్ వెర్ బ్లౌజ్ వేసుకుని నిహారిక అమ్మ పద్మజ పట్టు చీర కట్టుకుని ఫొటోలకి ఫోజులివ్వడమే కాదు... '32 ఏళ్ళ అమ్మ నిశ్చితార్ధపు చీరలో నేను' అంటూ నిహారిక అమ్మ ఫోటో - తన ఫోటోని కలిపి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Niharika - Remodelling Her Mother's 32 Year Old Engagement Saree:

Niharika - Remodelling Her Mother's 32 Year Old Engagement saree goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ