గోవాలో రవితేజ, గోపీచంద్ మలినేని 'క్రాక్' మూవీ లాస్ట్ షెడ్యూల్.
మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని రూపొందిస్తోన్న సినిమా క్రాక్. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట చిత్రీకరణ మాత్రమే మిగిలింది. గోవాలో శుక్రవారం (డిసెంబర్ 4) చివరి షెడ్యూల్ మొదలవనున్నది. ఇందులో రవితేజ, శ్రుతి హాసన్‌లపై చివరి పాటను చిత్రీకరించనున్నారు. రాజు సుందరం కొరియోగ్రఫీ సమకూరుస్తున్న ఈ పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తవనున్నది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న క్రాక్ లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలతో, ఒక ఇంటెన్స్ స్టోరీతో ఈ సినిమా తయారవుతోంది. ఇటీవల రవితేజ, అప్సరా రాణిపై చిత్రీకరించి, విడుదల చేసిన భూమ్ బద్దల్ అనే స్పెషల్ సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్టయింది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు.
ఎస్. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా క్రాక్ మూవీని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తారాగణం: రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి.
సాంకేతిక బృందం: కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాత: బి. మధు, బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్, సంగీతం: ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు, డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా, సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి.